ముందుకు సాగని స్మార్ట్‌ సిటీ పనులు

ABN , First Publish Date - 2020-10-07T06:16:08+05:30 IST

స్మార్ట్‌ సిటీతో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి, మేయర్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని

ముందుకు సాగని స్మార్ట్‌ సిటీ పనులు

రెండేళ్లుగా మోడల్‌ కాలనీకి మోక్షం లేదు  

సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి 


కరీంనగర్‌ అర్బన్‌, అక్టోబరు 6 : స్మార్ట్‌ సిటీతో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి, మేయర్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని కానీ పనులు ముందుకు సాగడం లేదని సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షు డు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్‌ నూతన కమిటీని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీ నిధులతో హౌసింగ్‌బోర్డు కాలనీని మోడల్‌ కాలనీగా అభివృద్ధి చేస్తామని మంత్రి, మేయర్‌లు చెప్పి రెండే ళ్లు దాటుతున్నా మోక్షం లేకుండా పోయిందని విమర్శించారు. వర్షం పడిందంటే  కాలనీ రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయని అన్నారు.


సర్కస్‌గ్రౌండ్‌ను పార్క్‌ గా అభివృద్ధి చేస్తామని వాహనాలకు పార్కింగ్‌ స్థలం లేకుండా అశాస్త్రీయంగా పనులు చేపట్టారని అన్నారు. ఇందిరాచౌక్‌ను ఎందుకు అభివృద్ధిచేయటం లేదని ఆయన ప్రశ్నించారు. అంతర్గత రోడ్లు, మురికికాలువ నిర్మాణం, తదితర సమస్యలపై కార్యాచరణ రూపొందించి పరిష్కారం కోసం పోరాటం చేస్తామ న్నారు. నూతన రెవెన్యూ చట్టం, ధరణి, ఆస్తుల సర్వేపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవటంతో అటు అధికారులతో పాటు ఇటు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారని అన్నారు.ఎల్‌ఆర్‌ఎస్‌ జీఓ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  


ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మా కర్‌రెడ్డి, సిటీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఏ మోసిన్‌, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షులు ఉప్పరి రవి, బీసీసెల్‌ అద్యక్షులు పులి అంజనేయులుగౌడ్‌, నాయకులు లింగంపెల్లి బాబు, కుర్ర పోచయ్య, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బిలి విక్టర్‌, పులి కృష్ణ, గాజుల రాజ్‌కోటి తదితరులు పాల్గొన్నారు. 


సిటీ కాంగ్రెస్‌ నూతన కమిటీ

కాంగ్రెస్‌పార్టీ నగరశాఖ నూతన కమిటీని అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. సిటీ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షు లుగా సయ్యద్‌ ఖమ్రొద్దీన్‌, మామిడి సత్యనారాయణరెడ్డి, మేకల నర్సయ్య, బత్తిని చంద్య్యగౌడ్‌, దండి రవీందర్‌, ముక్క భాస్కర్‌లు నియామకమయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కొలిపాక సందీప్‌, కొరివి అరుణ్‌కుమార్‌, కొట్టె ప్రభాకర్‌, దారపు లోక్‌నాథ్‌రెడ్డి, మహ్మద్‌ జమాలొద్దీన్‌, అస్తపురం రమేష్‌, దీకొండ శేఖర్‌బాబులని నియమించారు. అధికార ప్రతినిధులుగా బాలబద్రి శంకర్‌, ఎనమల్ల మంజుల, సర్దార్‌ దన్నాసింగ్‌, పోరండ్ల రమేష్‌, ఎంఏ వసీం, సానాది వెంకటేష్‌లను నియమించారు.


కార్యదర్శులుగా కంకణాల అనీల్‌కుమార్‌, యామ సుజమ్‌కు మార్‌, ఎంఏ నయీం, మొసర్ల రాంరెడ్డి, మహ్మద్‌ అమీర్‌, కొంపెల్లి కీర్తి కుమార్‌, పెద్దిగారి తిరుపతి, మంద వెంకట్‌రెడ్డి, మహ్మద్‌ఖాజా, ప్రచారకార్యదర్శులుగా రోళ్ళ సతీష్‌, బీ జాన్‌ గ్లాడ్‌స్టోన్‌, దావనపల్లి పీటర్‌సందీప్‌, కోశాధికారిగా పల్లెపాటి రాంమోహన్‌రావులను నియమించారు. 

Read more