నైపుణ్యంతోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు
ABN , First Publish Date - 2020-12-30T04:36:11+05:30 IST
ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఆయా రంగాలలో నైపుణ్యం సాధించాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
- సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, డిసెంబర్ 29: ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఆయా రంగాలలో నైపుణ్యం సాధించాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రాజారాంపెల్లిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ అంశాలలో యువతకు నిపుణుల చేత శిక్షణనిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని ఇక్కడ విజయవంతం అయితే రాష్ట్రం మొత్తం విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ప్రస్తుతం సబ్బుల తయారీలో శిక్షణ ఇప్పిస్తామని అనంతరం 300 ఉత్పత్తులకు విస్తరిస్తామన్నారు. ఆయా అంశాలలో శిక్షణ పొందిన యువతీ యువకులకు రుణాలతో పాటు మార్కెట్ సౌకర్యాన్ని ఎస్సీ కార్పొరేషన్ కల్పిస్తుందన్నారు. సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సదస్సును వినియోగించుకొని ఎవరి జీవితాన్ని వారే దిద్దుకోవాలన్నారు. మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న వారికి స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తామని, నర్సింగ్ విద్యార్థులకు ఇంగ్లష్‌లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, 14 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సుకు 1086 మంది యవతీ యువకులు పేర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ రఘు వీర్ సింఘ్, జగిత్యాల, పెద్దపెల్లి డీఆర్‌డీవోలు లక్ష్మినారాయణ, వినోద్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సరిత, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, మైనారిటీ అధికారి వరద రాజన్, ఎంపీపీ లక్ష్మి లింగయ్య, జడ్పీటీసీ సుధా రామస్వామి, నాయకులు కృష్ణారెడ్డి, రాంరెడ్డి, రత్నాకర్, రాంచంద్రం గౌడ్, జగన్, శేఖర్, జలంధర్ రెడ్డి, కుమార్, జగదీశ్వర్, భరత్ కుమార్, వెంకటేష్, సత్యం పాల్గొన్నారు.