సిరిసిల్ల జిల్లాలో ఒకే రోజు 19 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-15T19:58:54+05:30 IST

కరోనా విజృంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఒకే రోజు..

సిరిసిల్ల జిల్లాలో ఒకే రోజు 19 కరోనా కేసులు

సిరిసిల్ల(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఒకే రోజు 19మందికి పాజిటివ్‌ వచ్చింది.  సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 15మందికి, తంగళ్లపల్లి మండ లంలో ఇద్దరికి, వేములవాడలో ఒకరికి, కోనరావుపేట మండలంలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు 125 కేసులు నమోదయ్యాయి.  90  యాక్టివ్‌గా ఉన్నాయి. 30 మంది రికవరీ అయ్యారు. ఐదుగురు మృతిచెందారు. రోజురోజుకు కేసులు పెరుగు తుండడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 


Updated Date - 2020-07-15T19:58:54+05:30 IST