ఎమ్మెల్యే సహకారంతో ఏడు చెక్‌డ్యామ్‌లు

ABN , First Publish Date - 2020-12-30T04:22:57+05:30 IST

ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో మండలంలోని హుస్సేన్‌మియా వాగుపై ఐదు, మానేరుపై రెండు చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయని ఎంపీపీ నూనేటి సం పత్‌ అన్నారు.

ఎమ్మెల్యే సహకారంతో ఏడు చెక్‌డ్యామ్‌లు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ నూనేటి సంపత్‌

- కాల్వశ్రీరాంపూర్‌ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సంపత్‌యాదవ్‌

కాల్వశ్రీరాంపూర్‌, డిసెంబరు 29: ఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో మండలంలోని హుస్సేన్‌మియా వాగుపై ఐదు, మానేరుపై రెండు చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయని ఎంపీపీ నూనేటి సం పత్‌ అన్నారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలానికి సాగునీరు అందించేందుఉ చెక్‌డ్యామ్‌లు మంజూరీ చేయించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10లక్షలు మంజూరయ్యాయని, క్రిమిటోరియర్‌లోని బోర్‌వెల్స్‌కు ఉపయోగించనున్నట్టు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా విద్యుత్‌ సంబంధించిన పనులు వెనుకబడ్డాయని సర్పంచ్‌ దొమ్మెటి శ్రీనివాస్‌, ఎంపీటీసీ గూడెపు జనార్ధన్‌రెడ్డి, గడ్డం రాంచందర్‌ పేర్కొన్నారు. అదే విధంగా ఒనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం వల్ల మధ్య దళారులు లాభపడుతారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయకూడదన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల పూడిక తీయకుంటే చివరి ఆయకట్టుకు నీరు అందదని, పూడిక తీయించాలన్నారు. మిషన్‌ భగీరథ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని సర్పంచ్‌ దొమ్మేటి శ్రీనివాస్‌ ఆరోపించారు. 108 వాహనం లేకపోవడం వల్ల ఈ మండల ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వాహనం ఏర్పాటు  చేయాలని సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవి అన్నారు. గ్రామ గ్రామాన బెల్ట్‌షాపులు విచ్చల విడిగా నడుస్తున్నాయని, ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ గూడెపు జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు పనుల కోసం వస్తే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్‌లు ఆరోపించారు. ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీఓ కిషన్‌, డిప్యూటీ తహసీల్దర్‌ సుమన్‌, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:22:57+05:30 IST