సన్నరకం ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2020-12-02T05:06:30+05:30 IST
సన్నరకం వరిధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
కరీంనగర్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సన్నరకం వరిధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లాలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న సన్నరకం వరిధాన్యాన్ని గుర్తించి త్వరితగతిన కొనగోలు చేసి వెంటనే మిల్లులకు సరఫరా చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మొక్కజొన్నలను ఈ నెల 7 వరకు వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాధికారులు ధాన్యాన్ని పరిశీలించి రైతులకు నాణ్యత విషయంలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తరచూ తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా సహకార అధికారి శ్రీమాల, డీఆ ర్‌డీవో పీడీ రవీందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.