-
-
Home » Telangana » Karimnagar » sanitation staff
-
శానిటేషన్ సిబ్బందికి సలాం
ABN , First Publish Date - 2020-03-23T10:52:24+05:30 IST
కరోనా మహమ్మారితో దేశమంతా వణికి పోతుంటే పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలకు తెగించి నివారణ చర్యల్లో భాగస్వాములవుతున్నారు.

కోల్‌సిటీ, మార్చి 22: కరోనా మహమ్మారితో దేశమంతా వణికి పోతుంటే పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలకు తెగించి నివారణ చర్యల్లో భాగస్వాములవుతున్నారు. దీంతో పలువురు వారికి సలాం అని ప్రశంసిస్తున్నారు. ఆదివారం జనమంతా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యులయ్యారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. రోడ్లుపై మనిషి కనిపించని పరిస్థితి ఏర్పడింది.
ఇదే సమయంలో రామగుండం పారిశుధ్య కార్మికులకు అత్యవసర సిబ్బందిగా విధులు నిర్వహించారు. 15 బృందాలుగా ఏర్పడి నిత్యం జన సంచారం ఉండే ప్రాంతాల్లో యాంటీ వైరస్ ద్రావణాన్ని స్ర్పే చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, బస్ షెల్టర్లు, వైన్‌షాపులు, టిఫిన్ సెంటర్లు, మెయిన్ చౌరస్తా, పార్కులు, అంగడి ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ర్పే చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి సేవలు కొనసాగాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో 50డివిజన్లలో సేవలు అందించేందుకు 50 స్ర్పే పంపులు తెప్పించారు. సోమవారం నుంచి నిరంతరంగా స్ర్పే కొనసాగించనున్నారు.