ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2020-12-15T05:49:49+05:30 IST

మండలంలోని చొక్కారావుపల్లి శివారులో వున్న బిక్కవాగు నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకో వాలని ప్రజాప్రతినిధులు అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి
అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ప్రజాప్రతినిధులు

గన్నేరువరం, డిసెంబరు 14: మండలంలోని చొక్కారావుపల్లి శివారులో వున్న బిక్కవాగు నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకో వాలని ప్రజాప్రతినిధులు అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బిక్కవాగు ఇల్లంతకుంట మండలం పొత్తూర్‌ గ్రామానికి సరిహద్దుగా ఉందని తెలిపారు. పొత్తూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఇల్లంతకుంట మండల అధికా రులు, ప్రజాప్రతినిధుల అండతో ఇసుకను అక్రమం గా తరలిస్తున్నారని చెప్పారు. ఇటీవల ఇసుక రవా ణాను అడ్డుకున్న చొక్కారావుపల్లి రైతులపై, ప్రజా ప్రతినిధులపై దాడి చేసి వాహనాలను సైతం ధ్వం సం చేశారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో చొక్కారావు పల్లి సర్పంచ్‌ ముస్కు కరుణాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ చిట్కూరి అ నంతరెడ్డి, అనిల్‌రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. 

 ఇసుక లారీల పట్టివేత

మండలంలోని గుండ్లపల్లి రాజీవ్‌ రహదారిపై సోమ వారం తెల్లవారుజామున మంచిర్యాల జిల్లా కోటపల్లి నుంచి హైదరాబాద్‌కు ఇసుకను అక్రమం గా తరలిస్తున్న రెండు లారీలను పట్టుకున్నామని ఎస్‌ఐ ఆవుల తిరుపతి తెలిపారు. లారీలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ ఆవుల తిరుపతి హెచ్చరించారు.

Updated Date - 2020-12-15T05:49:49+05:30 IST