సార్వత్రిక సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2020-11-27T04:29:34+05:30 IST

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఒక రోజు సార్వత్రిక సమ్మె పెద్దపల్లి జిల్లాలో వి జయవంతం అయ్యింది.

సార్వత్రిక సమ్మె విజయవంతం
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

- విధులకు గైర్హాజరైన సింగరేణి కార్మికులు  

- పెద్దపల్లిలో భారీ ర్యాలీ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా 

- మున్సిపాలిటీల ఎదుట కార్మికుల నిరసనలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఒక రోజు సార్వత్రిక సమ్మె పెద్దపల్లి జిల్లాలో వి జయవంతం అయ్యింది. సమ్మెలో వామపక్ష పార్టీల అను బంధ కార్మిక సంఘాలు, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తదితర పార్టీ ల అనుబంధ కార్మిక సంఘాలతో పాటు ఇతరత్రా ట్రేడ్‌ యూనియన్లు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మెకు టీయూజేడబ్ల్యూ(ఐజేయూ) మద్దతు పలికింది. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికులు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథనిలోనూ పారిశుధ్య, ఇతర కార్మికులు విధులను బహిష్కరించి ర్యాలీలు నిర్వహించి ఆందోళన చే శారు. ఈసందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లా డుతూ వందేళ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలను కంపె నీల యజమానులకు అనుకూలంగా మార్చి కార్మికులను క ట్టుబానిసలను చేయాలని కేంద్రం చూస్తున్నదన్నారు. మారి న చట్టాలు అమలులోకి వస్తే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులను కార్మికులు కోల్పోతారని, రోజుకు 12 గంటల పని విధానం అమలులోకి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవ సాయ రంగాన్ని ధ్వంసం చేసే, ఆహార భద్రతను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయాలన్నారు. ఆదా యం పన్ను చెల్లింపు పరిధిలో లేని ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు జమ చేయాలని, పేదలందరికీ ఒక్కొ క్కరికి 10కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని, ఉ ద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకరా వాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలని, అసంఘటిత కార్మికులకు క నీస పెన్షన్‌ 10వేలు ఇవ్వాలని, కరోనా వ్యాక్సిన్‌ను దేశవ్యా ప్తంగా అందరికీ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

పెద్దపల్లి టౌన్‌ : సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువా రం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముం దు అయ్యప్పస్వామి ఆలయం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునిల్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్ష,కార్యద ర్శులు ఈదునూరి నరేష్‌, విశ్వనాథ్‌లు మాట్లాడారు. కార్మిక వర్గం వంద ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, రమేష్‌, జి.జ్యోతి, కొమురయ్య, చంద్రయ్య, రమేష్‌, దుర్గయ్య, రామకృష్ణ, సదా నందం, వెంకటస్వామిలతో పాటు పలు సంఘాల నాయకు లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:29:34+05:30 IST