-
-
Home » Telangana » Karimnagar » Rural development work should be completed by December
-
డిసెంబరులోగా పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-11-21T05:30:00+05:30 IST
గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులను డిసెంబరులోగా పూర్తి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు.

- జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి
కోనరావుపేట, నవంబరు 21 : గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులను డిసెంబరులోగా పూర్తి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. మండలంలోని వెంకట్రావు పేటలో శనివారం పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలను అన్ని గ్రామాల్లో ప్రారంభించాలన్నారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచుల ఫోరం కన్వీనర్ మంతెన సంతోష్, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, సర్పంచులు రేఖ, అశోక్, శ్రీనివాస్, ఎంపీటీసీ చారి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో చంద్రయ్య పాల్గొన్నారు.