-
-
Home » Telangana » Karimnagar » Runs for those from overseas
-
విదేశాల నుంచి వచ్చిన వారి కోసం పరుగులు
ABN , First Publish Date - 2020-03-23T10:55:07+05:30 IST
జిల్లాకు గల్ఫ్ ఇతర దేశాల నుంచి తిరిగి వస్తు న్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వీరిని కట్టడి చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం నానా హైరానా పడుతోంది.

హైదరాబాద్‌కు వలసకార్మికుడు తరలింపు... స్కూల్‌లో మరోకిరి నిర్భంధం
క్వారంటైన్‌ను నిర్లక్ష్యం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల): జిల్లాకు గల్ఫ్ ఇతర దేశాల నుంచి తిరిగి వస్తు న్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వీరిని కట్టడి చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం నానా హైరానా పడుతోంది. జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాలకు 825 మంది వచ్చారు. వీరిలో 350 మంది వరకు 14 రోజుల స్వీయ గృహనిర్బంధాన్ని పూర్తి చేశారు. మరికొందరు గృహ నిర్బంధంలో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు సరైన వివరాలను అధికారులకు ఇవ్వకపోవడంతో ఇం టింటి సర్వేను కొనసాగిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తు న్నారు. ఆదివారం ముస్తాబాద్ మండలం మో యినికుంటకు ఈనెల 20న గల్ఫ్ నుంచి వచ్చిన ముత్తయ్యకు కరోనా లక్షణాలు ఉన్నాయని హైద రాబాద్ తరలించారు. అక్కడ పరీక్షలు జరుపగా నెగెటివ్ రావడంతో తిరిగి గృహనిర్బంధంలో ఉంచారు.
తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన రామచంద్రం గల్ఫ్ నుంచి రాగా పాఠశాల లోని ఒక గదిలో ఉంచి నిర్భంధాన్ని కొనసాగి స్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్‌కు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ క్వారం టైన్‌ను నిర్లక్ష్యం చేసినందుకు కేసు నమోదు చేశా రు. జిల్లావ్యాప్తంగా పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండి ఇతర దేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచారు. సిరిసిల్ల కలెక్టరేట్, మున్సి పల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చి వారి వివరాలను తెలుపాలని ప్రచారాలు చేస్తున్నారు.