-
-
Home » Telangana » Karimnagar » Rowdysheeter commits suicide in Godavarikhani pedapalli
-
గోదావరిఖనిలో రౌడీషీటర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-15T05:45:19+05:30 IST
గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెం దిన రౌడీషీటర్ ఈద మహేందర్ అలియాస్ మహేష్(45) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగి వచ్చి ఠాణా ముందు పడిపోయిన మహేందర్
భార్య, మరో ఇద్దరిపై కేసు నమోదు
కోల్‌సిటీ, డిసెంబరు 14: గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెం దిన రౌడీషీటర్ ఈద మహేందర్ అలియాస్ మహేష్(45) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి అరుచుకుంటూ ఠాణా వద్దకు వచ్చి రోడ్డుపై పడిపోయాడు. ఆ సమయంలో ఠాణాలో ఒక ఎస్‌ఐ, సిబ్బంది మాత్రమే ఉన్నారు. గమనించిన సిబ్బంది వచ్చి చూసే సరికి నోటి నుంచి నురుగులు వస్తుండడంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కాగా అతడి మృతికి భార్య రాణి, మంథని మండలం ధర్మారం(గద్దలపల్లి)కి చెందిన పూదరి సర్వేష్, కొయ్యడ దేవేందర్ కారణమని, వారిపై చర్య లు తీసుకోవాలంటూ మహేష్ సోదరి గూళ్ల మహే శ్వరి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా రౌడీషీటర్ మహేష్ భార్య రాణితో సర్వేష్ వి వాహేతర సంబంధం కొనగిస్తున్నాడని కొంత కా లంగా గొడవలు జరుగుతున్నట్టు పోలీసులు పేర్కొ న్నారు. ఇదే క్రమంలో ఆదివారం గోదావరిఖనికి వచ్చిన సర్వేష్‌తో ఫైవింక్లయిన్ వద్ద మహేందర్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగడంతో మ హేందర్, సర్వేష్ స్నేహితుడు కొయ్యడ దేవేందర్ పరస్పరం పోలీ స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేందర్ సోదరి ఫిర్యాదు మేరకు భార్య రాణి, పూదరి సర్వేష్, కొయ్యడ దేవేందర్‌పై కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ సీఐ పర్స రమేష్ పేర్కొన్నారు.