-
-
Home » Telangana » Karimnagar » Road to our usage
-
మా వాడకట్టుకు రోడ్డేయించండి
ABN , First Publish Date - 2020-12-19T05:32:38+05:30 IST
మండలంలో ని సర్వారెడ్డిపల్లిలో రోడ్డు గురించి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ ను ఓ బాలుడు ప్ర శ్నించి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

ఎమ్మెల్యేను కోరిన బాలుడు
గంగాధర, డిసెంబ రు 18: మండలంలో ని సర్వారెడ్డిపల్లిలో రోడ్డు గురించి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ ను ఓ బాలుడు ప్ర శ్నించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఓవర్ హెడ్ ట్యాంకు ప్రారం భోత్సవానికి ఎమ్మెల్యే శుక్రవారం సర్వారెడ్డి పల్లికి వెళ్లారు. కార్య క్రమం అనంతరం తిరిగి వెళుతుండగా ముద్దం లడ్డూ అనే బాలుడు సార్.. మా వాడకట్టు కు రోడ్డేయించండి అని బిగ్గరగా అరిచాడు. వెంటనే ఎమ్మెల్యే రవిశంకర్ ఆగి ఆ బాలుడి వద్దకు వెళ్లి వి వరాలు అడిగాడు. తమ వాడలో మట్టిరోడ్డు ఉంద ని, వర్షాకాలంలో పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని ఆ బాలుడు ఎమ్మెల్యేకు చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే అధికారులను, సర్పంచ్‌ను పిలిచి నివేదికలు సిద్దం చేసి తనకు అందించాలని ఆదేశించారు. సమస్యను ధైర్యంగా తన దృష్టికి తీసుకొచ్చినందుకు బాలుడిని అభినందించారు.