ఇళ్ల నిర్మాణానికి క్యాలెండర్ తయారు చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-07-08T10:30:56+05:30 IST
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల్లో వేగవంతానికి ప్రత్యేక క్యాలెండర్ను తయారు చేసుకోవాలని, మండలానికో నోడల్ ..

మంత్రి కే తారకరామారావు
డబుల్ బెడ్రూంల నిర్మాణాలపై సమీక్ష
సిరిసిల్ల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల్లో వేగవంతానికి ప్రత్యేక క్యాలెండర్ను తయారు చేసుకోవాలని, మండలానికో నోడల్ అధికారిని నియమించాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డబుల్ బెడ్రూంల ప్రగతిపై నిర్వ హించిన సమీక్షలో మాట్లాడారు. 9 నెలల్లో జిల్లాకు కేటా యించిన 6,802 డబుల్ బెడ్రూంల నిర్మాణాలు పూర్తి కా వాలన్నారు. బాన్సువాడలో వికేంద్రీకృత విధానంతో ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తున్నారని, ఆ విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. భూమి దొరకలేదన్న కారణంతో ఇళ్ల నిర్మాణం జరగకుండా ఉండకూడదన్నారు.
రెవెన్యూ అధికారులు లోతుగా పరిశీలిస్తే ఎక్కడో ఒక చోట అవసరమైన స్థలం దొరుకుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపి క అత్యంత పారదర్శకంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోరని స్పష్టం చేశారు. ఎంపిక పూర్తయిన తరువాత జాబితాను పంచాయతీ నోటీసుబోర్డుపై ప్రద ర్శించాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ అరుణ, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య, శిక్షణ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ సమ్మయ్య, పీఆర్ ఈఈ కనకరత్నం పాల్గొన్నారు.