రిజిస్ట్రేషన్ల తీరుపై కోరుట్లలో నిరసనల వెల్లువ
ABN , First Publish Date - 2020-12-20T05:26:37+05:30 IST
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినూత్న నిరసన తెలిపారు.

కోరుట్ల, డిసెంబరు 19 : ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినూత్న నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అంబేడ్కర్ విగ్రహం నుండి జాతీయ రహదారిపై కార్గిల్ చౌరస్తా వరకు నిర్వహించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు పాయికారి రమేష్, ఏపూరి శ్రీనివాస్ గౌడ్, లంకదాసరి దేవదాసు, ఇట్యాల రాజేంధర్, వాసాల విజయ్, లక్ష్మినారాయణ, మౌనిక శ్రీనివాస్, గోపిగౌడ్, ఇస్మాయిల్, ముస్తాక్, గుండపల్లి శ్రీనివాస్, సల్లావోద్దిన్, ముభీన్, డ్యాక్‌మెంట్ రైటర్లు అహ్మద్ పాషా, హైమద్, అజహర్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.