పర్యాటక కేంద్రంగా రామగుండం
ABN , First Publish Date - 2020-03-16T11:47:16+05:30 IST
పర్యాటక కేంద్రంగా రామగుండం
- గోదావరిలో బోటు షికారు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
గోదావరిఖని, మార్చి 15: రామగుండాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. ఆదివారం మేయర్ డాక్టర్ అనీల్‌కుమార్‌తో కలిసి గోదావరినది వద్ద బోటు షికారు పనులను పరిశీలించారు. రెండు రోజుల క్రితం గోదావరిఖనికి పర్యాటకశాఖ రెండు బోట్లు మంజూరు చేయగా వాటిని గోదావరినదిలో నడిపేందుకు పనులు నిర్వహిస్తున్నారు. పనులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరికి జలకళ సంతరించుకున్నదని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకొని గోదావరిలో నీరు నిలిపి రైతుల, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. ప్రజలు నిత్యం అనేక పనులు చేసి అలసిపోతారని, వారికి ఉల్లాసం కలిగించే విధంగా బోట్లను ఏర్పాటు చేసినట్టు, ఒక్కొక్క బోటులో 42మంది ప్రయాణించవచ్చునని చెప్పారు. ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారిగా గోదావరిలో ‘కేసీఆర్ కప్’ తెప్పల పోటీ నిర్వహించి సీఎంతో ప్రశంసలు పొందామన్నారు. రాబోయే కాలంలో గోదావరినదిలో హరిత రిసార్ట్ ఏర్పాటు చేసి పర్యాటక రంగంగా మార్చి ఈ ప్రాంత ప్రజల కు జీవనోపాధి కల్పించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పా రు. రామగుండానికి బోట్లు మం జూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మె ల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కా ర్పొరేటర్లు, నా యకులు అడ్డాల గట్టయ్య, దాతు శ్రీనివాస్, బాలరాజ్‌కుమార్, బొడ్డు రవీందర్, గంగశ్రీను, పాతిపెల్లి ఎల్లయ్య, కాల్వ శ్రీనివాసస్, రవీందర్, తిరుపతి, రమేష్, నాగరాజు, శ్రావణి, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.