త్వరితగతిన రైతువేదికల నిర్మాణం పూర్తి

ABN , First Publish Date - 2020-11-19T06:06:33+05:30 IST

జిల్లా లో త్వరితగతిన రైతువేదికల నిర్మాణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సం బంధిత అధికారులను ఆదేశించారు.

త్వరితగతిన రైతువేదికల నిర్మాణం పూర్తి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

- జిల్లాలో రూ.11.88 కోట్లతో 54 రైతువేదికల నిర్మాణం : కలెక్టర్‌ 

పెద్దపల్లి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి) : జిల్లా లో త్వరితగతిన రైతువేదికల నిర్మాణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సం బంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతువేదికల నిర్మాణంపై బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులను సంఘటితం చేస్తూ మంచి లాభాలు తీసుకొనివచ్చి దేశంలోనే ఆద ర్శవంతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంద న్నారు. అందులో భాగంగా రైతుల సమస్యల ను చర్చించుకునేందుకు వీలుగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌లో రైతువేదికల నిర్మాణం చేప ట్టిందన్నారు. జిల్లాలో ఉన్న 54వ్యవసాయ క్లస్ట ర్‌లో రైతువేదికలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.11.88 కోట్ల నిధులను మంజూరుచేసిందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఉన్న 54 వ్యవసా య క్లస్టర్‌లలో రైతు వేదికలు నిర్మించడానికి అవసరమైన భూకేటాయింపులు చేశామని, అ వసరమైన పరిపాలన అనుమతులు జారీచేశా మని, ఇప్పటివరకు 49 రైతువేదికల నిర్మాణ పనులు పూర్తిచేశామని, మిగిలిన పనులు జ రుగుతున్నాయని అధికారులు వివరించారు. జి ల్లాలో రైతువేదికల నిర్మాణం పూర్తిచేసేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, రైతువేదికల నిర్మాణంలో కూలీల సంఖ్య పెంచి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశిం చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీ నారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ మునిరాజ్‌, డీఆర్‌డీవో వినోద్‌కుమార్‌, సంబంధి త అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T06:06:33+05:30 IST