-
-
Home » Telangana » Karimnagar » rain fear
-
నివర్ భయం
ABN , First Publish Date - 2020-11-28T05:25:17+05:30 IST
అన్నదాతల కష్టం ఇంటికి వచ్చే వేళ నివర్ తుపాను భయాన్ని నింపుతోంది. వరికోతలు, ధాన్యం కొనుగోళ్లు సాగుతున్న క్రమంలో తుపాను ప్రభావం కనిపిం చడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం మబ్బులు కమ్మి ముసురు మొదలవడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులుపడ్డారు. మరోవైపు చలి తీవ్రత కూడా పెరగడంతో తేమతో అవస్థలు పడే పరి స్థితి నెలకొంది.

- తుపాను ప్రభావంతో జిల్లాలో ముసురు
- కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకోవడానికి తంటాలు
- పెరిగిన చలి తీవ్రత
- ఈదురు గాలులతో వణికి పోతున్న జనం
- రాష్ట్రంలోనే రెండో స్థానంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అన్నదాతల కష్టం ఇంటికి వచ్చే వేళ నివర్ తుపాను భయాన్ని నింపుతోంది. వరికోతలు, ధాన్యం కొనుగోళ్లు సాగుతున్న క్రమంలో తుపాను ప్రభావం కనిపిం చడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం మబ్బులు కమ్మి ముసురు మొదలవడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులుపడ్డారు. మరోవైపు చలి తీవ్రత కూడా పెరగడంతో తేమతో అవస్థలు పడే పరి స్థితి నెలకొంది. జిల్లాలోని 226 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 16,649 మంది రైతుల నుంచి 72,118 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 17,527 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ధ్వారా 50,609 మెట్రిక్ టన్నులు, డీసీఎంస్ ద్వారా 1440 మెట్రిక్ టన్నులు, మెప్మాద్వారా 563 మెట్రిక్ ట న్నులు, మార్కెట్‌యార్డుల ద్వారా 1978 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రూ.149 కోట్ల ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు. ఈ సారి 3.10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఆంచనా వేశారు. ఇంకా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎక్కువగా ఆరబెట్టుకొని ఎదురు చూస్తున్నారు. టా ర్ఫాలిన్‌లు కప్పుతూ ముసు రు తేమ నుంచి కాపాడు కోవడానికి ఇబ్బందులు ప డుతున్నారు. తుఫాన్ ప్రభా వంతో వర్షం మొదలైతే భా రీగా నష్టపోతామని రైతు లు ఆందోళన చెందుతున్నా రు. కోతకు వచ్చిన పంట చేతికి రాకుండా పోతుందని భయపడుతున్నారు. తుఫా న్ ప్రభావం మరో ఐదు రో జులపాటు ఉంటుందని భా విస్తున్నారు. ఇప్పటికే అధి క వర్షాలతో నష్టపోయిన రై తులు తుఫాన్ ఎలాంటి ప్ర భావం చూపుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
వణికిస్తున్న చలి
జిల్లాలో తుఫాన్ ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రతల్లో రెండో స్థానంలో నిలిచింది. 17.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. రానున్న మూడు రోజుల్లో ఈదురు గాలులతో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చ రించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 25.7 డిగ్రీలు నమోదు కాగా రాబోయే మూడు రోజుల్లో 25 డిగ్రీల నుంచి 31 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని సూచించింది. చలి తీవ్రతకు జిల్లాలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగు తుండడంతో ఆందోళన చెందుతున్నారు.