ప్రజామరుగుదొడ్లను త్వరగా నిర్మించాలి
ABN , First Publish Date - 2020-08-11T10:35:33+05:30 IST
నగరంలోని 14ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్న ప్రజామరుగుదొడ్లను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని

నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి
కరీంనగర్ టౌన్, ఆగస్టు 10: నగరంలోని 14ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్న ప్రజామరుగుదొడ్లను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి కాంట్రాక్టర్లను ఆదేశించారు. సోమ వారం ఆమె ఎస్ఈ కృష్ణారావుతో కలిసి కలెక్టరేట్, అంబేద్కర్ స్టేడియం, ఉజ్వల పార్కు, ఎల్ఎండీ ఆనకట్ట, మంకమ్మతోట రాజీవ్పార్కు, రాంనగర్ ఆయూష్ ఆయుర్వేద హాస్పిటల్, మల్కాపూర్ రోడ్, జైలు కాంపౌండ్, వెటర్నరీ హాస్పిటల్, బీటీ మార్కెట్ యార్డు, రిసోర్సు పార్కు, మున్సిపల్ ఆఫీస్, ఆర్అండ్బీ ఆఫీసులలో నిర్మిస్తున్న ప్రజామరుగుదొడ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పద్రాంగస్టు వరకు పనులు పూర్తైన వాటిని ప్రారంభించి ప్రజలకు అందు బాటులోకి తేవాలని అనుకుంటున్నామని అన్నారు.