ప్రజల ఆరోగ్యమే పరమావధిగా...

ABN , First Publish Date - 2020-07-10T11:01:02+05:30 IST

కరోనా విజృంభిస్తున్న వేళ పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యమే పరమావధి గా సేవలందిస్తున్నారు

ప్రజల ఆరోగ్యమే పరమావధిగా...

కరోనా వేళ పారిశుధ్య కార్మికుల అలుపెరుగని సేవలు..

పాజిటివ్‌ కేసులున్న చోట సైతం ధైర్యంగా విధులు..

కార్మికుల రక్షణలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్లక్ష్యం

లాక్‌డౌన్‌లో నాసిరకం బ్లీచింగ్‌తోనే సేవలు..

గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోని యంత్రాంగం


కోల్‌సిటీ, జూలై 9: కరోనా విజృంభిస్తున్న వేళ పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యమే పరమావధి గా సేవలందిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదై న ప్రాంతాల్లోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నా రు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులు హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న ఇండ్లకు కూడా సేవలందిస్తున్నారు. ప్రాణాంతక పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ వైరస్‌ నియంత్రణ కోసం తమవంతు సేవలం దిస్తున్న కార్మికులు కొంతవరకు తమ కుటుంబాల పట్ల ఆందోళనతోనే ఉంటున్నారు. ప్రాణాలు ఫణం గా పెట్టి సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల రక్షణ విషయంలో కార్పొరేషన్‌ యంత్రాంగం కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.


రామగుండం నగరపాలక సంస్థలో సుమారు 400 మంది పారిశుధ్య కార్మికులు నిత్యం సేవలందిస్తున్నారు. మహిళా కార్మికులతో పాటు డ్రైన్‌క్లీనర్లు, ట్రాక్టర్లపై పనిచేసే చెత్త లిఫ్టర్లు, స్ర్పే విభాగం కా ర్మికులు సేలందిస్తున్నారు. 50 డివిజన్లలో ప్రతి రోజు ఉదయం 4.30గంటలకే విధుల్లో చేరి జనం లేవక ముందే వీధులను శుభ్రం చేస్తున్నారు. డ్రైన్‌క్లీనర్లు ఆయా డివిజన్లలో డ్రైన్లలో పూడిక తీయడం వంటి పనులు నిర్వహిస్తున్నారు. 


లాక్‌డౌన్‌ నుంచి కరోనా సేవల్లోనే..

కరోనా విస్తరిస్తున్న సమయంలో ప్రభుత్వం మార్చిలో లాక్‌డౌన్‌ విధించింది. అప్పటినుంచి పా రిశుధ్య కార్మికుల సేవల్లో మరింత భారం పెరిగిం ది. గతంలో సాధారణ పారిశుధ్య సేవలు చేసే కార్మికులు కరోనాతో నిత్యం బ్లీచింగ్‌ చల్లడం, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయడం వంటి సేవల్లో నిమగ్నమవుతున్నారు. పాజిటివ్‌ కేసులు న మోదైన డివిజన్లలో అంతా హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఆయా డివిజన్లలో మొత్తం పా రిశుధ్యానికి సంబంధించిస్పెషల్‌ డ్రైవ్‌లు చేస్తున్నారు. 


పాజిటివ్‌ కేసులు ఉన్న ఇళ్లకూ సేవలు..

కొవిడ్‌ నిబంధనల ప్రకారం పాజిటివ్‌ బాధితుల ఇళ్లలో చెత్త నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రామగుండం న గరపాలక సంస్థ పరిధిలో అలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. హోమ్‌ ఐసోలే షన్‌ చికిత్స పొందుతున్న బాధితుల ఇళ్లకు కూడా పారిశుధ్య కార్మికులే సేవలందిస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారి సేవలను కొనసాగిస్తున్నారు. ఈ విష యమై ఇప్పటి వరకు నగరపాలక సంస్థ యంత్రాంగం కార్మికులు సరై న అవగాహన కల్పించిన పరిస్థితి లేదు. పాజిటివ్‌ కేసులు ఉండి హోమ్‌ ఐసోలేషన్‌ ఉన్న ఇళ్ల కు సేవలందించేందుకు ప్రత్యేక  విభాగాన్ని కూడా ఇంతవరకు కార్పొరేషన్‌లో ఏర్పాటు చేయలేదు. 


నాసిరకం బ్లీచింగ్‌ పౌడర్‌..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. రా మగుండం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో మాత్రం ఇప్పటికీ పెద్దగా మార్పులు రాలేదు. లాక్‌డౌన్‌లో కరోనా నియంత్రణకు 400 బస్తాల బ్లీ చింగ్‌ పౌడర్‌ తెప్పించగా అవి నాసిరకంగా ఉన్నా యంటూ పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు గ గ్గోలు పెట్టారు. అదేబ్లీచింగ్‌ పౌడర్‌తో పనులు చేయించారు. పలు డివిజన్లలో ప్రజాప్రతినిధులు, ప్ర జలు కార్మికులను నిలదీసిన ఘటనలున్నాయి. అయి నా నాసిరకం బ్లీచింగ్‌ వినియోగాన్ని ఆపలేదు. 


రెండు సెట్ల గ్లౌజ్‌లు, ఆరు మాస్క్‌లు

కరోనా పోరులో అలుపెరుగని యుద్ధం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు రక్షణ చర్యలపరంగా పూర్తిస్థాయిలో కార్పొరేషన్‌ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోలేకపోతోంది. మార్చి నుంచి ఇప్పటివరకు రెం డు సెట్ల గ్లౌజ్‌లు, ఆరు మాస్క్‌లు, ఆరు శానిటైజర్‌ బాటిళ్లు ఇచ్చారు. ముఖ్యంగా చెత్త ఎత్తే లిఫ్టర్లు, డ్రైన్‌ క్లీనర్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నా రు. కార్పొరేషన్‌ ఇచ్చిన మాస్క్‌లు సరిపోక కార్మికులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తు తం సామాజిక వ్యాప్తి జరుగుతుందనే ప్రచారంలో సైతం శానిటైజర్లను ఎక్కువగా అందుబాటులో ఉంచాల్సి ఉండగా, అలాంటి చర్యలు చేపట్టడంలేదు.


కేసుల పెరుగుదలతో కార్మికుల్లో ఆందోళన..

రామగుండంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకు పె రుగుతుండడంతో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సింగరేణి ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు వచ్చి నా కార్పొరేషన్‌ కార్మికులే సేవలందించడం పరిపాటిగా మారింది. చివరికి ఎన్‌టీపీసీ వంటి టౌన్‌షిప్‌లో సైతం పాజిటివ్‌ కేసులు నమోదు కాగా పారిశుధ్య కార్మికులే సేవలందించారు. సింగరేణి, ఎన్‌టీపీసీ యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా కార్మికులకు చేయూతనిచ్చిన పరిస్థితి లేదు. ప్రస్తుతం జూలై, ఆ గస్టు మాసాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతాయని ప్రభుత్వం పేర్కొంటున్నా కార్మికులకు రక్షణ చర్యల పరంగా మాత్రం నగరపాలక సంస్థలో పూర్తిస్థాయిలో ప్రణాళిక చేయలేకపోతున్నారు.


క్షేత్రస్థాయిలో భరోసా ఏదీ..?

రామగుండం నగరపాలక సంస్థలో గతంలో తెల్లవారు 5 గంటల నుంచే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర మున్సిపల్‌ అధికారులు పారిశుధ్య సేవలను పర్యవేక్షించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇతర శాఖ ల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లే పరిస్థితి లేదు. కొవిడ్‌ వే ళ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో కార్మికుల వెంట ఉండి భరోసా కల్పించడం లో దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-07-10T11:01:02+05:30 IST