-
-
Home » Telangana » Karimnagar » Proudly Congress party inauguration ceremonies
-
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
ABN , First Publish Date - 2020-12-29T04:41:20+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా కా ర్యాల యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

పెద్దపల్లి కల్చరల్ , డిసెంబరు 28: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా కా ర్యాల యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య హాజరై కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందన్నారు. రాబోయో కాలంలో ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీ సుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయ కులు భూషణవేణి రమేష్‌గౌడ్, కల్వల శ్రీనివాస్, ఎండీ సర్వర్, ఎస్పీ రాజయ్య, శ్రీనివాస్, సుతారి లక్ష్మణ్, వేముల రాజు, నర్సింహులు, సందీప్ పాల్గొన్నారు.