-
-
Home » Telangana » Karimnagar » Proudly Congress party founding day
-
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ABN , First Publish Date - 2020-12-29T04:56:28+05:30 IST
కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలను నిర్వ హించారు.

కరీంనగర్ అర్బన్, డిసెంబరు 28: కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలను నిర్వ హించారు. జిల్లాకాంగ్రెస్ కార్యాలయంలో, హైమద్‌పురలో జరిగిన కార్యక్రమా లకు జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై పార్టీ పతాకాన్ని ఎగురవేసి, కార్యకర్తలచేత ప్రతిజ్ఞ చేయించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రేకుర్తిలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండా ఎగువేసి వేడుకలను నిర్వహించారు.
కరీంనగర్ రూరల్: కొత్తపల్లిలోని బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనాయకులు ఆవిర్భావవేడుకలు ఘనంగా నిర్వహించారు.
హుజూరాబాద్/జమ్మికుంట/ఇల్లందకుంట/వీణవంక/సైదాపూర్/ చొప్పదండి/గంగాధర/శంకరపట్నం/రామడుగు/మానకొండూర్/ తిమ్మాపూర్/చిగురుమామిడి: హుజూరాబాద్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం లో ఆపార్టీ జెండాను ఆవిష్కరించారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్, చొప్పదండి, గంగాధర, శంకరపట్నం, రామడుగు, మానకొండూర్ మండల కేంద్రాల్లో వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. చిగురుమామిడి మండలం సుందరగిరిలో మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.