శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడండి
ABN , First Publish Date - 2020-12-17T05:45:05+05:30 IST
శ్మశానవాటిక స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని మండలంలోని జైనా గ్రామపంచాయతీ పరిధిలో గల బో యగూడెం గ్రామస్తులు బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో ని ర్వహించారు.

జాతీయ రహదారిపై బోయగూడెం గ్రామస్తులు రాస్తారోకో
ధర్మపురి, డిసెంబరు 16: శ్మశానవాటిక స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని మండలంలోని జైనా గ్రామపంచాయతీ పరిధిలో గల బో యగూడెం గ్రామస్తులు బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో ని ర్వహించారు. దీంతో గంట సేపు వాహనాలు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. గ్రామస్తులు మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాల యానికి చేరుకుని శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలంటూ నినాదాలు చే శారు. అనంతరం కార్యాలయం ఎదుట గల జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బో యగూడెం సమీపంలో గల ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా గ్రామ స్తులు శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇటీవల ఒక వ్యక్తి కొంత స్థ లాన్ని ఆక్రమించి వ్యవసాయం చేసుకునేందుకు చదును చేసినట్లు పే ర్కొన్నారు. వెంటనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధి కారులను కోరారు. దీనిపై తహసీల్దార్ రవీందర్ మాట్లాడుతూ బోయగూడెంకు చెందిన ఓర్సు రాములు అనే వ్యక్తికి సర్వే నెంబర్ 333/3/1లో 2 ఎక రాల 10 గుంటలు, సర్వే నెంబర్ 365/7లో ఎకరం కలిపి మొత్తం 3 ఎ కరాల 10 గుంటలు భూమి పట్టా కలిగి ఉన్నట్లు తెలిపారు. ఈ భూమి హద్దులు గుర్తించామని, ఎలాంటి ఆక్రమణలు లేవన్నారు. ఏఎస్‌ఐలు ఎండీ పాషా, రాజు చేరుకుని గ్రామస్తులకు నచ్చ జెప్పి రాస్తారోకో విర మింపజేశారు.