-
-
Home » Telangana » Karimnagar » problems of employees and pensioners must be solved
-
ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-15T06:03:25+05:30 IST
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలని, ఐఆర్ అందించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.

సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 14 : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయాలని, ఐఆర్ అందించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బీజేపీ జిల్లా కమిటీ అధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాలతో 2018లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పీఆర్సీని అమలు చేయడంతోపాటు సమస్యలను పరిష్కారిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో గంగయ్యకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రెడ్డబోయిన గోపీ, రేగుల మల్లికార్జున్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రావుల రాజిరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి, ఆవునూరి రమాకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పట్టణ అధ్యక్షుడు అన్నల్‌దాస్ వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాకూర్‌రాజుసింగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్, పట్టణ అధ్యక్షుడు మల్లఢపేట భాస్కర్, శ్రీనివాసరావు, సురువు వెంకటి, కౌన్సిలర్లు బొల్గం నాగరాజుగౌడ్, భాస్కర్, చెన్నమనేని కమలాకర్‌రావు, గుండేల్లి వేణు పాల్గొన్నారు.