-
-
Home » Telangana » Karimnagar » potest rally by youth congress
-
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన
ABN , First Publish Date - 2020-12-31T04:47:28+05:30 IST
కేంద్రప్ర భుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, శీతాకాల సమావేశా లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు పడాలరాహుల్ ఆధ్వ ర్యంలో బుధవారం సాయంత్రం కాగడాల ప్రదర్శన చేశారు.

కరీంనగర్ అర్బన్, డిసెంబరు 30: కేంద్రప్ర భుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, శీతాకాల సమావేశా లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు పడాలరాహుల్ ఆధ్వ ర్యంలో బుధవారం సాయంత్రం కాగడాల ప్రదర్శన చేశారు. బస్టాండ్ నుంచి ఒకటోఠాణా మీదుగా అమరవీరుల స్థూపం వరకు యువజనకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాగడాలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అటు ప్రతిపక్షాలు ఇటు రైతుల నుంచి నిరసనలు తీవ్రమవతున్న నేపథ్యంలో బీజేపీకి దేశంలో ఎక్కడా అనుకూల పరిస్థితులు లేవని గమనించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేశారన్నారు.