మత్తడి దూకుతున్న చెరువులు
ABN , First Publish Date - 2020-08-12T10:23:11+05:30 IST
మండలంలోని రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ఇప్పటికే ఎస్సారెస్పీ ఆయకట్టు కింద

హుజూరాబాద్, ఆగస్టు 11: మండలంలోని రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ఇప్పటికే ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్న చెరువులు 70 శాతం నిండగా వర్షాలతో పూర్తిగా నిండిపోయాయి.
శంకరపట్నం: మండలంలోని ముత్తారం చెరువు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో, ఎస్సారెస్పీ నీటితో నిండి మత్తడి దూకుతోంది.
రామడుగు: మండలంలోని వెలిచాల చిన్నచెరువు, పెద్ద చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండలా మారాయి.
రాయికల్ జలపాతం వద్ద సందర్శకుల సందడి
సైదాపూర్: మండలంలోని రాయికల్ జలపాతం సందర్శకులతో కళకళలాడుతోంది. మంగళవారం శ్రీ కృష్ణాష్టమి సెలవుదినం కావడంతో జలపాతం వద్ద సందడి నెలకొంది.