-
-
Home » Telangana » Karimnagar » Political silence in the district
-
జిల్లాలో రాజకీయ నిశ్శబ్దం
ABN , First Publish Date - 2020-11-26T05:06:02+05:30 IST
జిల్లాలో రాజకీయ నిశ్శబ్దం అలు ముకుంది. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా సైలెంట్ అయింది.

జీహెచ్‌ఎంసీ ప్రచారంలో అధికార, ప్రతిపక్ష నేతలు
రాజకీయ విమర్శలు, ఆరోపణలకు బ్రేక్
జగిత్యాల అర్బన్, నవంబరు 25 : జిల్లాలో రాజకీయ నిశ్శబ్దం అలు ముకుంది. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా సైలెంట్ అయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి జి ల్లా నుంచి వందల సంఖ్యలో నేతలు తరలివెళ్లడమే ఈ పరిస్థితికి కారణం. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ విమర్శల పొలిటికల్ హీ ట్ కాస్త ఈ ప్రచారంతో చల్లబడింది. నిత్యం అధికార, ప్రతిపక్ష నేతలు చేసుకునే విమర్శ, ప్రతివిమర్శలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బ్రేక్ పడింది.
శుభకార్యాల్లోనూ కనిపించని రాజకీయ సందడి
కార్తీక మాసం ఆరంభం కావడంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంచి రోజులు ఉండడంతో జిల్లాలో భారీగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే శుభకార్యం ఉన్నచోట పలుకుబడిని బట్టి నేతలు వస్తూ హడావిడి చేయడం సాధారణ విషయమే. ప్రస్థుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా ప్రచారంలో బిజీగా ఉండడంతో, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో సైతం రాజకీయ హడావిడి, సందడి అంతగా కనిపించడం లేదు. స్థానిక నేతలే వీఐపీ నేతలుగా మారి శుభకార్యాల్లో పాల్గొనే పరిస్థితి నెలకొంది.
నేతలంతా గ్రేటర్‌లో బిజీబిజీ...
ఆయా పార్టీల అధిష్టానాల ఆదేశానుసారం నేతలకు తమ పార్టీ అ ప్పగించిన డివిజన్లకు పరిమితం అయిపోయి ప్రచార బాధ్యతల్లో మునిగిపోయారు. అభ్యర్థులను గెలిపించుకుని ఆయా పార్టీల అధిష్టానాల వ ద్ద తమ సత్తా చాటుకునేందుకు అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఈ నెల 29తో ప్రచారం గడువు ముగియనున్నా డిసెంబర్ 4న విడుదలయ్యే ఫ లితాల వరకు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు.
ఇప్పటికే 135వ డివిజన్ వెంకటాపురం, సుభాష్‌నగర్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సబిత తరుపున మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించగా, రెడ్‌హిల్స్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రియాంక తరుపున జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, 102వ డివిజన్‌లో చొప్పందడి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అధికార పార్టీ 115వ డివిజన్ కూకట్ పల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పడిగల శిరీష తరుపున కోరుట్ల ఎమ్మెల్యే వి ద్యాసాగర్‌రావు ప్రచారం చేస్తుండగా, 89వ డివిజన్ గాంధీనగర్‌లో అ ధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా పద్మ తరుపున జడ్పీ ఛైర్మన్ దావ వసంత పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే టీటీడీపీ రా ష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ టీడీపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార బా ధ్యతలు మోస్తుండగా, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సె గ్మెంట్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కో ఆర్టినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ నుంచి నుంచి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, బీ జేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి, ము దుగంటి రవీంధర్‌రెడ్డితో పాటు, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు యూనుస్ న దీమ్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ 4 ఎన్నికల ఫలితాల వర కు జిల్లాలో ఇలాగే నిశ్శబ్దం కొనసాగే అవకాశం ఉంది. మరి గ్రేటర్ ఎ న్నికల్లో పార్టీల ప్రచార పోటీ ఏ మేరకు ఆయా పార్టీలకు ఫలితాన్ని చే కూరుస్తుందో తెలుసుకోవాలంటే డిసెంబర్ 4వరకు వేచిచూడాల్సిందే మరి.