-
-
Home » Telangana » Karimnagar » police sramadaanam
-
పోలీసుల శ్రమదానం
ABN , First Publish Date - 2020-11-26T05:22:57+05:30 IST
కరీంనగర్ పోలీసు శిక్షణ కేంద్రంలో నాటిన మొక్కల వద్ద కమిషనరేట్ పోలీసులు బుధవారం శ్రమదానం నిర్వహించారు.

కరీంనగర్ క్రైం, నవంబరు 25: కరీంనగర్ పోలీసు శిక్షణ కేంద్రంలో నాటిన మొక్కల వద్ద కమిషనరేట్ పోలీసులు బుధవారం శ్రమదానం నిర్వహించారు. పోలీస్‌కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాటిన మొక్కల ఎదుగు దలకు అడ్డంకిగా ఉన్న కలుపు మొక్కలను ఏరిపారేశారు. ఈ శ్రమదానంలో అన్నిస్థాయిలకు చెందిన అధికారులు తమ పాతజ్ఞాప కాలను నెమరువేసుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, ఏసీపీ శివభాస్కర్, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, సీఐలు నాగేశ్వర్‌రావు, నాగేందర్, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్, కిరణ్‌కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.