పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-27T05:11:48+05:30 IST

నూతనంగా ప్రారంభించిన పోలీస్‌ ఫైరింగ్‌ రేంజ్‌ శిక్షణ కేంద్రం జగిత్యాల జిల్లా పోలీస్‌ యంత్రాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని పోలీస్‌ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఐజీ ప్రమోద్‌ కుమార్‌ అన్నారు.

పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం
గొల్లపల్లి మండలం వెన్గుమట్లలో ఫైరింగ్‌ శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్న ఐజీ

గొల్లపల్లి, డిసెంబరు 26: నూతనంగా ప్రారంభించిన పోలీస్‌ ఫైరింగ్‌ రేంజ్‌ శిక్షణ కేంద్రం జగిత్యాల జిల్లా పోలీస్‌ యంత్రాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని పోలీస్‌ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఐజీ ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని వెన్గుమట్ల గ్రామంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ ఫైరింగ్‌ రేంజ్‌ శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఎస్పీ సింధుశర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైరింగ్‌ రేంజ్‌ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అడిషనల్‌ ఎస్పీ సురేష్‌ కుమార్‌, డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌ బాబా, ఆర్‌ డీఎస్పీ ప్రతాప్‌, సీఐలు రాంచందర్‌ రావు, రాజేష్‌, కిషోర్‌, ఆర్‌ఐలు సైదులు, నవీన్‌, వామన మూర్తి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:11:48+05:30 IST