పల్స్ ఆక్సీమీటర్‌లతో పోలీసుల తనిఖీలు
ABN , First Publish Date - 2020-04-28T10:26:37+05:30 IST
కమిషనరేట్ పోలీసులు కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగంతో

కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 27: కమిషనరేట్ పోలీసులు కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగంతో ముందుకు సాగుతున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు థర్మల్‌స్కానర్లతో స్ర్కీనింగ్ టెస్టులను కొనసాగిస్తున్న పోలీసులు తాజాగా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సహకారంతో సోమవారం పల్స్ ఆక్సిమీటర్ల వినియోగాన్ని ప్రారంభించారు.
కమిషనరేట్ వ్యాప్తంగా ఈ పల్స్ ఆక్సిమీటర్లను వినియోగిస్తూ వాహనాల తనిఖీ సందర్భంగా తటస్థపడిన ప్రజలకు హార్ట్‌బీట్, పల్స్‌రేటును గుర్తిస్తున్నారు. సోమవారం ఇందిరాచౌక్ వద్ద ఈ కార్యక్రమాన్ని సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తనిఖీల సమయంలో వాహనదారులకు ఆక్సీమీటర్‌తో పరీక్షిస్తున్నామని అన్నారు.
ఈ పరీక్షతో వ్యక్తి పల్స్‌తోపాటు శ్వాసలో ఆక్సీజన్ శాతం కూడా తెలుస్తుందన్నారు. హెచ్చుతగ్గులను గుర్తించిన సమయంలో వారిని ఆస్పత్రిలో పరీక్షించుకోవాలని సూచిస్తున్నామని అన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా 10ఆక్సీమీటర్‌లతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.