రూ.3లక్షల పొగాకు ఉత్పత్తులు పట్టివేత

ABN , First Publish Date - 2020-11-26T05:18:35+05:30 IST

కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, జమ్మికుంట పోలీసులు సంయుక్తంగా బుధవారం జమ్మికుంట శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా 3లక్షల రూపాయల పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి.

రూ.3లక్షల పొగాకు ఉత్పత్తులు పట్టివేత
నిందితులను అరెస్టు చూపుతున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు


కరీంనగర్‌ క్రైం, నవంబరు 25: కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, జమ్మికుంట పోలీసులు సంయుక్తంగా బుధవారం జమ్మికుంట శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా 3లక్షల రూపాయల పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి. పొగాకు ఉత్పత్తుల రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి పొగాకు ఉత్పత్తులతోపాటు 2సెల్‌ ఫోన్‌లు, ఒక కారు, ఒక ఆక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నారు. కరీం నగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అందిన సమాచారంతో జమ్మికుంట శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమ దేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన భారతకృష్ణ  అనుమానా స్పదంగా కనపడడంతో అతని వాహనంలో తనిఖీ చేయగా రూ.3లక్షల పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి. అతన్ని అదుపులోకి తీసుకుని విచా రించగా హుజురాబాద్‌ మండలానికి చెందిన ఆగురి కృష్ణమూర్తితో కలిసి ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నామని పేర్కొన్నాడు. సిద్దిపేట జిల్లా అక్క న్నపేట మండలం కట్కూర్‌కు చెందిన రాయి ఆదర్శ వద్ద పొగాకు ఉత్ప త్తులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఆదర్శను పోలీసులు విచారించగా కర్ణాటక రాష్ట్రం బీదర్‌లోని అమర్‌ ట్రేడర్స్‌ నుంచి పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పాడు. భరత్‌కృష్ణ, రాయి ఆదర్శలను అరెస్టు చేశామని, కృష్ణమూర్తితోపాటు అమర్‌ట్రేడర్స్‌ యజమాని ఎండీ నవీద్‌ఉల్‌హక్‌ పరారీలో ఉన్నాడని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్‌ ఫోర్స్‌ సీఐలు ఆర్‌ ప్రకాశ్‌, కే శశిధర్‌రెడ్డి, జమ్మికుంట సీఐ సృజన్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సైలు కరుణాకర్‌, నరేష్‌రెడ్డి, బి స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

Read more