రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2020-12-30T04:50:41+05:30 IST

పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ శశాంక ఆన్నారు. మంగళవారం మున్సిపల్‌ పరిదిలోని మారుతి నగర్‌, ధర్మారం, ఎఫ్‌సిఐ, వీణవంక రోడ్లను కలెక్టర్‌ పరిశీలించారు.

రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి
వీణవంక ప్రధాన రహదారులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ శశాంక

జమ్మికుంట, డిసెంబరు 29: పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ శశాంక ఆన్నారు. మంగళవారం మున్సిపల్‌ పరిదిలోని మారుతి నగర్‌, ధర్మారం, ఎఫ్‌సిఐ, వీణవంక రోడ్లను కలెక్టర్‌ పరిశీలించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అందులో బాగంగానే రోడ్లకు రెండు వైపుల మొక్కలు నాటాలని సంబందిత అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. వాటర్‌ ట్యాంకులు తీసుకు వెళ్లి మొక్కలకు నీళ్లు పోయాలంటే ఇబ్బందులు ఎదురు అవుతాయని, ప్రధాన రహాదారుల వెంట మార్గం మధ్యలో వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లు ఏర్పాటు చేసి ప్రతి రెండు రోజులకు ఒక సారి మొక్కలకు నీళ్లు పోయాలని సూచించారు. రహాదారులు అన్ని పచ్చని చెట్లతో కళకళలాడాలని ప్రభుత్వ ఉద్దేశ్యం ఆన్నారు. మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో పని చేసి మొక్కలు నాటాలన్నారు. మొక్కలు పెరిగి పెద్దవి అయిన తర్వాత విధ్యుత్‌ తీగలు అడ్డు వచ్చాయని, ఈ స్థలం మరో శాఖ పరిదిలోకి వస్తుందని పెరిగిన చెట్లను కొట్టివేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జనవరి 30వ తేది వరకు ప్రజల సహాకారంతో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలేం, ఎమ్మార్వో కన్నం నారాయణ, కమిషనర్‌ ఎండి అనిసూర్‌ రషీద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-30T04:50:41+05:30 IST