పెద్దపల్లి జిల్లాకు దక్కని ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’

ABN , First Publish Date - 2020-12-16T05:29:15+05:30 IST

జిల్లాకు దక్కాల్సిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ఆంబులెన్స్‌ల జాడ లేకుండా పోయా యి.

పెద్దపల్లి జిల్లాకు దక్కని ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’
మూలన పడ్డ జిల్లా కేంద్రంలోని అంబులెన్స

 108 అంబులెన్స్‌లే దిక్కు 

 మరమ్మతులకూ నోచుకొని వాహనాలు

పెద్దపల్లి టౌన్‌, డిసెంబరు 15: జిల్లాకు దక్కాల్సిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ఆంబులెన్స్‌ల జాడ లేకుండా పోయా యి. ఆరు నెలల క్రితం ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ పేరిట అంబు లెన్స్‌లు కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటిం చారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో  ఆంబులెన్స్‌లు అక్కడి ఎమ్మెల్యే, మంత్రులు పట్టుబట్టి సమకూర్చు కొని అట్టహాసంగా ప్రారంభించి రొడ్డెక్కించారు. పక్క జిల్లా మంచిర్యాలలో 13 అంబులెన్స్‌లు ఉండగా స్మైల్‌ గిఫ్ట్‌ కింద మరో రెండు అంబులెన్స్‌లు సేవలం దిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాకు అంబులెన్స్‌ల కొరత ఉంది. ఉన్న అంబులెన్స్‌లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఎక్కడ ఆగిపోతాయే అన్న ఆందోళనలో వాటిని నడపలేక వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. రోగులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే వరకు నానా అవస్థలు పడు తున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్‌లు మొరాయించినప్పుడు డ్రైవర్లతో వివాదాలు, చేయిచే సుకున్న పరిస్థితితులు కూడా ఉన్నాయి. 

జిల్లాలో బసంత్‌నగర్‌, కమాన్‌పూర్‌, పెద్దపల్లి, సు ల్తానాబద్‌ ఓదెల, మంథని ధర్మారం, గోదావరిఖనిల లో 9 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇవి కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు స్మైల్‌ గిఫ్ట్‌ కింద జూల పల్లి, అంతర్గాం మండలాలకు కేటాయించాల్సి ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో జిల్లాకు రాలేకపోతున్నాయి. ఇప్పటి వరకు పెద్దపల్లి, సుల్తానా బాద్‌, మంథని, ధర్మారం అంబులెన్స్‌లు నెల రోజు లుగా నడులేని పరిస్థితిలో ఉంటే ధర్మారం, మంథని అంబులెన్స్‌లు ఇటీవలే మరమ్మతులకు నోచుకున్నా యి. జిల్లా కేంద్రం పెద్దపల్లి, సుల్తానాబాద్‌ అంబులె న్స్‌లు మెకానిక్‌ షెడ్డులకు పరితమయ్యాయి. జిల్లా కేంద్రానికి అంబులెన్స్‌ లేకుండా పోయింది. 

జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్‌ షెడ్డుకే పరిమితమయ్యింది. ఇక్కడి నుంచి రోజుకు నాలుగై దు కేసులు కరీంనగర్‌ తరలించాల్సి ఉండగా 108 అంబులెన్స్‌ల పైనే ఆధారపడతున్నారు. వీటికి సమ యం సరిపోక పోవడంతో పక్క మండలాల అంబు లెన్స్‌ను వినియో గించుకోవాల్సి వస్తోంది. ఇవి సమ యానికి రాకపోయే సరికి జరుగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోతోంది. ప్రైవేట్‌ అంబులెన్స్‌ల దోపిడీ విచ్చల విడిగా పెరిగిపోయింది. వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే జిల్లా కేంద్రానికి బీఎల్‌ఎస్‌  (బెస్ట్‌ లైవ్‌ సపోర్టు) అంబులెన్స్‌ అవసరం ఉన్నది. ఇందులో ఆధునిక పరికరాలు, వెంటిలేటర్‌, ఈసీజీ,  తదితర అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు జిల్లా లో మొత్తం సాదారణ అంబులెన్స్‌లు  సేవలందిస్తు న్నాయి. ఇందులో కేవలం ప్రథమ చికిత్సకు సంబం ధించిన పరికరాలు మాత్రమే ఉంటాయి. రోడ్డు ప్ర మాదాలు, గుండెపోటు, తదితర ఎమర్జెన్సీ కేసులు వ చ్చినప్పుడు దేవుడిపైనే భారం వేయాల్సి వస్తోంది. బాధితుల దగ్గరికి సమయానికి రాక.. ఆస్పత్రిలో చే ర్చాల్సిన సమయానికి చేరవేయలేక అంబులెన్స్‌ సి బ్బంది నానా తంటాలు పడుతున్నారు. దీనికి తోడు డీజిల్‌ ఆవరేజ్‌ కోసం అంబులెన్స్‌ల వేగాన్ని 70 కి.మీలకు తగ్గించారు. అత్యవసర సమయాల్లో వేగం లేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కనీసం 100 కిలో మీటర్ల వేగం ఉండాలని వాహనాల డ్రైవ ర్లు పేర్కొంటున్నారు. జిల్లాలో ఉన్న అన్ని అంబులె న్స్‌లను తీసేసి నూతనంగా బీఎల్‌ఎస్‌ వాహనాలు సమకూర్చాలని పలువురు కోరుతున్నారు.

 డ్రైవర్ల కొరత..


చాలీచాలని జీతాలతో డ్రైవర్లు అంబులెన్స్‌లపై పని చేస్తున్నారు. డ్రైవర్ల కొరత ఉండడంతో ఒక్కొక్క సారి నెలంతా ఇంటి వైపు చూడకుండా విధులు ని ర్వర్తిస్తున్నారు. పాత పద్ధతిలో రెండు వాహనాలకొక రిలీవర్‌ ఉండే వారు. ఇప్పుడు మూడు బండ్లకొక రిలీ వర్‌ ఉన్నాడు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. తరుచూ డ్రైవర్లను జిల్లాలు మార్చు తుండడంతో వందల కిలో మీటర్లు బస్సు చార్జీలు భ రించుకొని అప్‌అండ్‌డౌన్‌ డ్యూటీ చేయాల్సి వస్తోం ది. ఈ లెక్కన ఐదారు వేలు రవాణ ఛార్జీలకే ఖర్చు అవుతాయి. ఆంబులెన్స్‌ డ్రైవర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 

 కొటేషన్లు పంపించాం..

- డాక్టర్‌ ప్రమోద్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

అంబులెన్స్‌ల కొటేషన్లు పంపిచాం. వాటి గురిం చి పూర్తిగా వివరాలు మాకు రాలేదు. ఇప్పుడు ఎంపీ నిధుల ద్వారా జిల్లా ప్రధానాస్పత్రికి 30 లక్షలతో బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ కోసం కొటేషన్‌ పంపించాం. త్వరలో వస్తుంది.


Read more