నాడు నక్సల్‌ కోట.. నేడు అభివృద్ధి బాట..

ABN , First Publish Date - 2020-03-02T12:43:53+05:30 IST

మండలంలోని మా నేరు నదీ తీరాన ఉన్న కిష్టంపేట గ్రామం ప్రస్తుతం స్వచ్ఛత వైపు అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టి న 30 రోజుల ప్రణాళిక, పల్లె

నాడు నక్సల్‌ కోట.. నేడు అభివృద్ధి బాట..

  • పక్కాగా ప్రభుత్వ పథకాల అమలు
  • గ్రామాభివృద్ధి విరాళాలతో ప్రజల తోడ్పాటు
  • ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు
  • స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్న కిష్టంపేట

కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని మా నేరు నదీ తీరాన ఉన్న కిష్టంపేట గ్రామం ప్రస్తుతం స్వచ్ఛత వైపు అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టి న 30 రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతి, స్వచ్ఛ శుక్రవా రం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామస్థులు గ్రామాభివృద్ధికి భాగస్వామ్యమై ప్రగతికి తోడ్పాడు అందిస్తున్నారు. గ్రామసర్పంచ్‌ కాసర్ల తిరుపతిరెడ్డితో పాటు జీపీ పాలకవర్గ సభ్యులు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. 


ఇంటింటా చెత్త బుట్టలు


ఇంటింటా ఉన్న చెత్తను ఆరుబయట వేయకుండా దాతల సహాయంతో చెత్తబుట్టలను సేకరించి ఇంటిం టా ఆ బుట్టలను అందజేశారు. దీంతో గ్రామస్థులు తమ ఇండ్లలోగాని, ఆరుబటయ ఉన్నా చెత్తను బయ ట వేయకుండా చెత్తబుట్టల్లో వేస్తున్నారు. ఇంటింటా ఉన్న చెత్తను గ్రామపంచాయతీ సిబ్బంది డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతీ రోజు ట్రైసైకిళ్ల ద్వారా పారిశుధ్య సిబ్బంది తడిచెత్త, పొడి చెత్త వేర్వేగా సేక రించి, తడి చెత్తను కంపొస్టు ఎరువు తయారుచేసేలా కంపోస్టు ఎరువు తయారుచేసే విధంగా కంపొస్టు గుంతలో వేస్తున్నారు. పొడిచెత్తఅయిన ప్లాస్టిక్‌ వ్యర్థా లను, సీసాలను ఇనుప ముక్కులను వేరే చేసి ఒకచో ట నిల్వ చేస్తున్నారు.


మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు


కిష్టంపేట గ్రామంలో 1,508 జనాభా ఉండగా, మొ త్తం కుటుంబాలు 376 ఉన్నాయి. ఈ కుటుంబాలకు ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు ఉన్నాయి. దీంతోపాటు ఆ గ్రామంలో ప్రత్యేకంగా కమ్యూనిటీ మ రుగుదొడ్డి కూడా నిర్మించారు.


స్థాయి సంఘాల కమిటీలు ఏర్పాటు 


కిష్టంపేట గ్రామంలో స్థాయి సంఘాల కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. పారిశుధ్య డంప్‌యార్డు కమిటీ, శ్మశాన వాటి క స్థాయి కమిటీ, వీధి దీపాల స్తంభాల కమిటీ, మొ క్కల పెంపకం, పచ్చదనం స్థాయి సంఘం, పనులు, సంతలు స్థాయి సంఘం కమిటీలు ఏర్పాటు చేశారు.

 

ఇంటింటికి ఆరు మొక్కలు 


ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వగా, గ్రామస్థులు వాటిని పెంచుకుంటున్నారు. ఐదు చోట్ల కమ్యూనిటి ప్లాంటేషన్‌ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను నాటారు. ఎస్సారెస్పీ కాలువలు, అంతర్గత రహదారు లు, ఆర్‌అండ్‌బీ రహదారి వెంట మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. 


ప్లాస్టిక్‌ నిషేధం


గ్రామంలో ప్లాస్టిక్‌ నిషేధించారు. దుకాణాల్లో ప్లాస్టి క్‌ కవర్లు ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని అన్ని దుకాణాదారులకు నోటీసులు అందజేశారు. గ్రామం లో ప్లాస్టిక్‌ వాడకం నిషేధించబడిందని ఇళ్ల గోడలపై రాశారు. గ్రామంలోని ఎవరి చేతుల్లోనైనా ప్లాస్టిక్‌ కని పిస్తే రూ.500 జరిమానా విధిస్తామని గ్రామపంచా యతీ పాలకవర్గం ప్రకటించింది.  


గ్రామాభివృద్ధికి విరాళాలు


పలువురు గ్రామస్థులు విరాళాలు అందజేసి గ్రా మాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. గ్రామానికి చెం దిన కడెం మహేష్‌ రూ.15వేల విలువ చేసే చెత్తబు ట్టలు, పల్లెర్ల రమేష్‌ రూ.10వేల విలువచేసే చేతి సం చులు, మ్యాడగోని తిరుపతి రూ.3వేలు, ముల్కోజు శోభారాణి రూ.15 వేలు, గీస రాజయ్య రూ.15 వేలు, ఇన్స్‌ఫైర్‌ యూత్‌ రూ.25వేల విలువ చేసే కంప్యూటర్‌ సిస్టం, వేముల బ్రదర్స్‌ రూ.15వేలు, ఎండి అక్బర్‌పా షా రూ.7వేలు, గీసుకొండ లక్ష్మీనారాయణ రూ.5వేలు, అపెక్స్‌ ఆసుపత్రి రూ.4వేల విరాళం అందించారు. 


కమ్యూనిటీ ప్లాంటేషన్‌, నర్సరీ


గ్రామంలో 5ఎకరాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్‌ ఏర్పా టు చేసి రకరకాల పండ్ల మొక్కలను పెట్టారు. పండ్ల మొక్కలతోపాటు వేప, తదితర చెట్లను ప్లాంటేషన్‌లో పెంచడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ప్రత్యేకం గా నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో ఆయా ర కాల 21 వేల మొక్కలను పెంచుతున్నారు.


కలెక్టర్‌తోపాటు అధికారుల పర్యటన


అప్పటి కలెక్టర్‌ శ్రీదేవసేనతో పాటు ఆయా శాఖల అధికారులు గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంతా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడంతో గ్రామపంచా యతీ పాలకవర్గాన్ని మండల స్థాయి అధికారులు, గ్రామస్థులను అప్పటి కలెక్టర్‌ దేవసేనతో పాటు ఆయా శాఖల అధికారులు అభినందించారు. దేవసేన కిష్టంపేట గ్రామంలో పర్యటించి మొక్కలను నాటారు. ఈ గ్రామంలోని వాడవాడలు తిరిగి ఇంటింటా నిర్మిం చుకున్న మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను చూసి ఈ కిష్టంపేట గ్రామం దేశానికి ఆదర్శం కావాలన్నారు. అ లాగే గ్రామంలోని నర్సరీ, ప్లాంటేషన్‌తోపాటు గ్రామా న్ని సీఆర్‌డీ శేశుకుమార్‌, జేసీ వనజాదేవితో పాటు పలువురు ఆర్డీఓలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. 


ఒకప్పుడు నక్సల్‌ కోట


కిష్టంపేట గ్రామం ఒకప్పుడు నక్సల్‌ కోట. సాయం త్రం 6 గంటల అయ్యిందంటే ఒకవైపు పోలీసులు, మ రోవైపు నక్సల్స్‌తో గ్రామం భయం గుప్పిట్లో ఉండేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా గ్రామంలో స్వేచ్ఛా వా తావరణం నెలకొంది. ప్రస్తుతం గ్రామం అభివృద్ధి దిశ గా అడుగులు వేస్తోంది. ఈ గ్రామం పరిశుభ్రతోపా టు పచ్చని చెట్లు, చెత్తచెదారం లేని రహదారులు, స్వచ్ఛతలో ముందుకుపోతోంది.


కేంద్ర బృందం పర్యటన


కిష్టంపేటలో కేంద్ర బృందం పర్యటించింది. గ్రా మంలోని నర్సరీ, ఇంటింటా ఇంకుడు గుంతలు, మరు గుదొడ్లు, గ్రామానికి ఇరువైపులా ఉన్న చెట్లు, డంపిం గ్‌యార్డు పరిశీలించి జీపీ పాలకవర్గాన్ని అభినందిం చారు. పారిశుధ్యం పచ్చదనంతో ఉన్న గ్రామ వాతా వారణాన్ని చూసి కొనియాడారు. 

Updated Date - 2020-03-02T12:43:53+05:30 IST