అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన

ABN , First Publish Date - 2020-09-29T06:07:27+05:30 IST

అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో కాగిత రహిత పాలన అమలు చేస్తామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన

కలెక్టర్‌ శశాంక


కరీంనగర్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో కాగిత రహిత పాలన అమలు చేస్తామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో ఈ-ఆఫీస్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిరోజు రెండు, మూడు డిపార్ట్‌మెంట్ల వారిగా ఈ-ఆఫీస్‌పై ట్రైనింగ్‌, బేసిక్‌ ఓరియంటేషన్‌ ఇవ్వబడుతుందని అన్నారు. షెడ్యూళ్ల వారిగా ఫైల్స్‌ తయారు చేయాలని, అధికారులందరూ నేర్చుకుని ఉండాలని, నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.


కలెక్టరేట్‌లో కాగిత రహిత పాలన అనేది మొదటగా కలెక్టర్‌ కార్యాలయం నుండే మొదలవుతుందని, దశల వారీగా మిగతా ఆఫీసులన్నిటికీ తీసుకువస్తామన్నారు. కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయాల్లో కాగిత రహిత పాలన చేయాలని అన్నారు. ప్రతి కార్యాలయంలో వికలాంగులకు సంబంధించి వీల్‌చైర్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, జిల్లా పంచాయతీ అధథికారి బుచ్చయ్య, డీఆర్‌డీఏ సూపరింటెండెట్‌ పి శ్రీదేవి, డీసీఎస్‌వో కె సురేష్‌ రెడ్డి, డీఎండబ్ల్యూవో డి మధుసూదన్‌, సీపీవో వి పూర్ణచంద్రారవు, డీఎంఎం శ్రీకాంత్‌, ఎన్‌ఐసీ ఎ శివరాం, అడిషనల్‌ డీఆర్‌డీవో బి వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

 

గజ ఈతగాళ్లను సన్మానించిన కలెక్టర్‌

 మానేరువాగులో చిక్కుకున్న వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన మత్స్యకారులను కాపాడిన గజ ఈతగాళ్లను  కలెక్టర్‌ శశాంక సోమవారం కలెక్టరేట్‌లో సన్మానించారు. గజ ఈతగాళ్లు తిప్పరవేణి మల్లేశం, గందె శ్రీనివాస్‌, కొత్తూరి పర్శరాములు, గీకురు సంపత్‌, గీకురు రాజే శం, గీకురు శేఖర్‌, జంకుటి ఆనందం, ఎండ సంపత్‌లను శాలువా, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఖదీర్‌ అహ్మ ద్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T06:07:27+05:30 IST