పల్లె ప్రగతి, కరోనాపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-03-21T11:39:08+05:30 IST

పల్లె ప్రగతి, కరోనా వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం అన్నారు.

పల్లె ప్రగతి, కరోనాపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం


జగిత్యాల, ఆంధ్రజ్యోతి: పల్లె ప్రగతి, కరోనా వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పల్లె ప్రగతిపై మండలాల వారీగా పనుల పురోగతితో పాటు కరోనా వైరస్‌పై మాట్లాడారు.  పల్లెప్రగతిలో చేపట్టిన పనులన్నీ కొనసాగించాలని, ముఖ్యంగా గ్రామాలలో శానిటేషన్‌ మెరుగుపర్చాలని సూచించారు.


గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ రోడ్‌పై గుంతలు లేకుండా చూడాలని, పిచ్చి మొక్కలు లేకుం డా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాటరింగ్‌ చేయాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని అన్నారు. అందరూ హెడ్‌ క్వాటర్‌లోనే ఉండాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీనారాయణ, డీపీవో శేఖర్‌, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు, గ్రామ ప్రత్యేక అధికారులు, ఎంపీవోలు , కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-21T11:39:08+05:30 IST