మా ఊరికి రావొద్దని గ్రామ సరిహద్దులో బోర్డు ఏర్పాటు

ABN , First Publish Date - 2020-03-24T11:41:34+05:30 IST

బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు... కరోనా వ్యాధి కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై రూ.500 జరిమానా అంటూ ఓ గ్రామం ఏకంగా తీర్మానం ప్రకటించింది.

మా ఊరికి రావొద్దని గ్రామ సరిహద్దులో బోర్డు ఏర్పాటు

పాలకుర్తి జీపీ పాలకవర్గం తీర్మానం


పాలకుర్తి, మార్చి 23: బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు... కరోనా వ్యాధి కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై రూ.500 జరిమానా అంటూ ఓ గ్రామం ఏకంగా తీర్మానం ప్రకటించింది. పాలకుర్తి గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి గ్రామ సరిహద్దులో బోర్డులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కరోనా వైరస్‌  తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఏకంగా పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నది.


గ్రామంలోకి ఎవరూ రాకుంటే వ్యాధి వచ్చే అవకాశమే లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్‌ దుర్గం జగన్‌ తెలిపారు. పాలకవర్గ తీర్మానం మేరకు యువకులతో కలిసి గ్రామంలోకి వచ్చే దారులపై బండలు, కర్రలతో మూసివేసి బోర్డు ఏర్పాటు చేశారు. ఊరిలో సైతం నిషేధంపై, వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాటింపు వేయించారు. ఈ నిషేధంపై గ్రామంలో సైతం హర్షం వ్యక్తమైంది. గ్రామంలో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేశారు. 


Read more