-
-
Home » Telangana » Karimnagar » Operation Smile must succeed
-
‘ఆపరేషన్ స్మైల్’ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-12-31T04:45:50+05:30 IST
ఆపరేషన్ స్మైల్(ముస్కాన్) 7వ విడత కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయా లని డీసీపీ రవిందర్ ఆదేశించారు.

- రేపటి నుంచి నెలాఖరు వరకు అమలు
- ప్రారంభ కార్యక్రమంలో డీసీపీ రవిందర్
జ్యోతినగర్, డిసెంబరు 30: ఆపరేషన్ స్మైల్(ముస్కాన్) 7వ విడత కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయా లని డీసీపీ రవిందర్ ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్ 7ను ఎన్టీపీసీ ఈడీసీలో బుధవారం డీసీపీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ 7వ విడత ఆపరేషన్ ముస్కాన్ జనవరి 1నుంచి 31వరకు కమి షనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని గోదావ రిఖని, పెద్దపల్లి, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి సబ్ డివిజన్‌లో కొనసాగుతుందన్నారు. 18సంవత్సరాలలోపు తప్పిపోయిన, ఒదిలిపెట్టిన, బాల కార్మికులుగా ఉన్న బాలబాలికల సమాచారాన్ని సేకరించడంతోపాటు వారి ని రక్షించాలని సూచించారు. రెస్క్యూ చేసిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు చొరవతీసుకోవా లన్నారు. చిన్నపిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిం చిన వారిపై, వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇలాంటివారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రతి డివిజన్‌లో ఒక ఎస్‌ఐ, నలుగురు జవానులను నియమిస్తున్నామని తె లిపారు. తప్పిపోయిన పిల్లలు, బాలకార్మికులుగా ఉన్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు ఆపరేషన్ ముస్కాన్ పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. మంచిర్యాల ఇంచార్జి ఎస్‌ఐ 9490706375, జైపూర్ ఇంచార్జి ఎస్‌ఐ 6309770712, బెల్లంపల్లి ఇంచార్జి ఎస్‌ఐ 98661 36140, పెద్దపల్లి ఇంచార్జి ఎస్‌ఐ 9440587815, గోదావరి ఖని ఇంచార్జి ఎస్‌ఐ 8179817989 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు.