ఎన్నారై పాలసీని అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-15T05:51:51+05:30 IST

ప్రభుత్వం ఎన్నారై పాలసీని అమలు చేసి గల్ఫ్‌ కార్మికుల కుటుంబా లను ఆదుకోవాలని జీడబ్ల్యూఏసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దొనికేని కృష్ణ, రేండ్ల శ్రీనివాస్‌ డి మాండ్‌ చేశారు.

ఎన్నారై పాలసీని అమలు చేయాలి
ర్యాలీ నిర్వహిస్తున్న గల్ఫ్‌ బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు

గంగాధర,డిసెంబరు14: ప్రభుత్వం ఎన్నారై పాలసీని అమలు చేసి గల్ఫ్‌ కార్మికుల కుటుంబా లను ఆదుకోవాలని జీడబ్ల్యూఏసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దొనికేని కృష్ణ, రేండ్ల శ్రీనివాస్‌ డి మాండ్‌ చేశారు. సోమవారం గంగాధర మండ లం కాచిరెడ్డిపల్లి, కొండయ్యపల్లిలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ జెండాను ఆవిష్కరించారు. గ్రామాల్లో గల్ఫ్‌ బాధిత కుటుంబాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కృష్ణ, శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ నుంచి కార్మికులు పెద్ద ఎత్తున గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారన్నారు. అక్కడ ఏజెంట్లు, కంనెనీ యాజమానుల చేతిలో మోసపోతున్నారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఎన్నారై పాలసీని అమలు చేసి గల్ఫ్‌ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్‌, అధికార ప్రతినిధి గాజుల సంపత్‌, సర్పంచ్‌ ఆముదాల వెంకటమ్మ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-15T05:51:51+05:30 IST