నాన్‌లోకల్ ప్రజాప్రతినిధి
ABN , First Publish Date - 2020-03-16T08:49:14+05:30 IST
ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండ కుండాపోతున్నారు. పట్టణాలు నగరాల్లోనే ఉంటూ గ్రామాలకు చుట్టపుచూపుగా వచ్చివెళుతున్నారు.
రాజధాని, జిల్లా, మండల కేంద్రాల నుంచి రాకపోకలు
స్థానికంగా లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు
భార్యల కంటే భర్తల పెత్తనం
కొత్త పంచాయతీరాజ్ చట్టంతో వేటుపడే అవకాశాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల): ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండ కుండాపోతున్నారు. పట్టణాలు నగరాల్లోనే ఉంటూ గ్రామాలకు చుట్టపుచూపుగా వచ్చివెళుతున్నారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్, సిరిసిల్ల జిల్లా కేంద్రం, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లి రావడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులు కేవలం అధికారిక కార్య క్రమాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే సమయంలోనే కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో 253మంది సర్పంచ్‌లు, 2,230 వార్డుసభ్యు లు, 12 జడ్పీటీసీలు, 123మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఎంపీటీసీల్లోంచి మరో 12మంది మండల పరిషత్ చైర్మ న్, వైస్‌చైర్మన్లుగా పదవులను చేపట్టారు. రిజర్వేషన్ల కార ణంగా 50శాతం మహిళలు పదవులు పొందారు. మరి కొన్ని జనరల్ స్థానాల్లో కూడా మహిళలు గెలుపొందా రు. కొందరు సర్పంచ్‌లు హైదరాబాద్ నుంచి వారం వారం ఇక్కడికి చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు సిరిసిల్ల జిల్లాకేం ద్రంతో పాటు వేములవాడ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మహిళా ప్రతినిధులు కేవలం అధికారిక కార్యక్రమాలు, మంత్రు లు, ఎమ్మెల్యేలు వచ్చే సమయంలోనే కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బోయినపపల్లి మండలంలో ఏడుగురు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు స్థానికంగా ఉండకుండా ఉమ్మడి కరీంనగర్, వేములవాడలో ఉంటు న్నారు. గంభీరావుపేటలో ఇద్దరు సర్పంచ్‌లు, ముస్తా బాద్‌లో ఒక సర్పంచ్ హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ముస్తాబాద్ మండల పరిషత్ వైస్‌చైర్మన్ కరీంనగర్‌లో ఉంటుండగా, చందుర్తి ఎంపీపీ, జడ్పీటీసీ, రుద్రంగి ఎంపీపీ, వేములవాడ నుంచి వచ్చి పోతున్నారు. వీర్నపల్లి జడ్పీటీసీ సిరి సిల్ల నుంచి, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ హైద రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరికొంత మంది సర్పంచ్‌లు, ఎంపీ టీసీ లు స్థానికంగా ఉండడం లేదు. గెలుపొం దిన గ్రామాల్లో సొంత ఇళ్లు, వ్యవసాయం ఉన్నప్పటికి పూర్తిస్థాయిలో గ్రామాల్లో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
భార్యలకు బదులుగా భర్తల పెత్తనం
జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల్లో సగం మంది మహిళలే ఉన్నారు. 50 శాతం రిజర్వేషన్లతో పదవులు వరించినా వారికి బదులుగా వారి భర్తలే పెత్తనమే కొనసాగుతోంది. గ్రామాల్లో కూడా మహిళలనే ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నా గ్రామస్థులు కూడా సతులకు బదులు పతులనే సర్పంచ్‌లు, ఎంపీ టీసీలుగా భావిస్తున్నారు. చివరకు గ్రామాల్లో పల్లె ప్రగ తి వంటి కార్యక్రమాల రూపకల్పన, అభివృద్ధి పనుల ప్రణాళిక రూపకల్పనలో జిల్లాస్థాయి అధికారులు సైతం భర్తలతోనే చర్చలు జరపడం గమనార్హం. జిల్లాలో ఒక మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె కరీంనగర్‌లో ఉండగా ఆమె భర్త మాజీ చైర్మన్ హోదాలోనే అధికారిక కార్యక్రమాల్లో పా ల్గొంటున్నారు. ఆమె కేవలం మండల పరిషత్ సమావేశానికే పరిమితమైనట్లు చెప్పుకుంటు న్నారు. భర్తలు చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టడానికే మహిళ సర్పంచ్‌ల నుంచి జడ్పీటీసీ ల వరకు పరిమితమయ్యారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమం లో మహిళ కౌన్సిలర్ల భర్తలను సమావేశ మందిరం నుంచి బయటకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొత్త చట్టం ప్రకారం కష్టమే...
కొత్తగా వచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి సర్పంచ్ గ్రామంలోనే ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల ను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండని, విధులు నిర్వర్తించని సర్పంచ్‌లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు ఉంది. కొత్త చట్టంపై అవగా హన లేకపోవడం, ఎవరూ ఏం చేస్తారో అనే ధీమాతో ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగించడం పరిపాటిగానే మారింది.