సహకార సంఘాల్లో నామినేషన్ల సందడి

ABN , First Publish Date - 2020-02-08T11:55:45+05:30 IST

సహ కార సంఘాల ఎన్నికల్లో రెండవ రోజు 239 నామి నేషన్లు దాఖలు కాగా మొదటిరోజు 62 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం రెండు

సహకార సంఘాల్లో నామినేషన్ల సందడి

  • మొదటిరోజు 62, రెండోరోజు 239 
  • జిల్లాలో మొత్తం 301 దాఖలు 
  • నేటితో ముగియనున్న గడువు

పెద్దపల్లి(ఆంధ్రజ్యోతి): సహ కార సంఘాల ఎన్నికల్లో రెండవ రోజు 239 నామి నేషన్లు దాఖలు కాగా మొదటిరోజు 62 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం రెండు రోజులు కలిపి 301 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈనెల 8న నామినేషన్లకు గడువు ముగియనున్నది. ఆయా సహకార సంఘాల్లోని కొన్ని డైరెక్టర్‌ స్థానాలకు ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు కాలేదు. మొద టి రోజు అంతంత మాత్రంగానే నామినేషన్లు వచ్చినప్పటికీ రెండవ రోజు వాటి సంఖ్య నాలుగిం తలు పెరిగింది. రెండవ రోజు చిన్నకల్వల సంఘా నికి 23 నామినేషన్లు వచ్చాయి. దూళికట్ట సంఘా నికి 10, ఎలిగేడు సంఘానికి 9, గర్రెపల్లి సంఘానికి 8, జూలపల్లి సంఘానికి 19, కమాన్‌పూర్‌ సంఘా నికి 9, కనుకుల సంఘానికి 7, కూనారం సంఘా నికి 9 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మంథని సహకార సంఘానికి 14, మేడిపల్లి సంఘానికి 5, ముత్తారం సంఘానికి 14, నందిమేడారం సంఘాని కి 21, పత్తిపాక సంఘానికి 11 నామినేషన్లు వచ్చా యి. సుద్దాల సంఘానికి 9, శ్రీరాంపూర్‌ సంఘానికి 16, కన్నాల సంఘానికి 12, పొత్కపల్లి సంఘానికి 17, సుల్తానాబాద్‌ సంఘానికి 12, పెద్దపల్లి సంఘా నికి 12, అప్పన్నపేట సంఘానికి 4 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటివరకు అన్ని సంఘాల్లో నామినేష న్లు రాగా, చివరిరోజు కూడా పెద్దసంఖ్యలో నామినే షన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం చేసుకునేం దుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు స్థానిక సంస్థల్లో ఓటమి చెందిన నాయకులు సహ కార సంఘాల్లో ఓటు ఉన్నవారు చైర్మన్‌ స్థానాలపై కన్నేశారు. ఒక్కో డైరెక్టర్‌ స్థానంలో ఓటర్ల సంఖ్య త క్కువగా ఉండటంతో 3నుంచి 5లక్షల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు తెలిసిం ది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు ఓటర్ల జాబితాను అనుసరించి ఓటర్లను కలుస్తూ ప్రసన్నం చేసుకునేందుకు చర్చిస్తున్నారు.

Updated Date - 2020-02-08T11:55:45+05:30 IST