రైతుల్లో నివర్‌..ఫీవర్‌

ABN , First Publish Date - 2020-11-28T04:33:24+05:30 IST

ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రైతుల్లో నివర్‌..ఫీవర్‌
కల్లాల నుంచి ధాన్యాన్ని ఇంటికి తరలిస్తున్న రైతులు

వెంటాడుతున్న తుఫాన్‌ భయం 

చలిగాలులు, చిరుజల్లులతో వాతావరణం

కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం

ఆందోళనలో అన్నదాతలు 

జగిత్యాల అగ్రికల్చర్‌, నవంబరు 27: ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం నివర్‌ తుఫాన్‌ రూపంలో విరుచుకు పడింది. నివర్‌ తు ఫాన్‌ ప్రభావంతో వాతావరణ పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఓ వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు అధికారుల సూ చనలు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకున్న రైతులు తమ పంటను కాపాడుకోడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యా ప్తంగా ఉన్న 385 కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో సుమారు లక్షన్నర క్విం టాళ్ల వరకు అధికారులు అంచనాలు వేస్తున్నారు. 

చలిగాలులు, చిరుజల్లులు 

నివర్‌ తుఫాన్‌ కారణంగా ఉదయం నుంచి వాతావరణం చలిగాలు లు వాయగా, పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో పల్లెలు, పట్టణాల్లో ప్రజలు బయటకి రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. దీనికి తో డు అడపాదడపా పలుచోట్ల చిరుజల్లులు, తేలికపాటి కురవడంతో మరింత ఇబ్బందికరంగా మారింది.

కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు

జిల్లాలో పలుచోట్ల వరికోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైతు లు కోసిన ధాన్యాన్ని కల్లాలకు చేరవేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాల్లో చాలాచోట్ల పెద్ద సంఖ్యలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, వాతావరణ మార్పులతో రైతు ల్లో ఆందోళన నెలకొంది. రెండు వారాల నుంచి కొనుగోళ్లు ప్రారంభం అ యినప్పటికీ ధాన్యం సేకరణ మాత్రం ఆశించిన స్థాయిలో వేగంగా సా గడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 2.20లక్షల ధాన్యం సేకరించగా, ఇంకా మరో లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

అసౌకర్యాల నడుమ సాగుతున్న కొనుగోళ్లు 

జిల్లాలో వానాకాలం పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తరుపున ఇప్పటికే 385 కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు. ప్రధానంగా చా లా చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలం లేకపోవడం ఇ బ్బందికరంగా మారింది. చాలా చోట్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ని ర్వహణకు స్థలంలేక రోడ్లపైనే ధాన్యం పోసే పరిస్థితి ఏర్పడింది. వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు టార్ఫాలిన్‌ కవర్లు సైతం అందుబాటులో లే కపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

Updated Date - 2020-11-28T04:33:24+05:30 IST