అయ్యయ్యో..వానరమా
ABN , First Publish Date - 2020-08-02T10:13:18+05:30 IST
అయ్యయ్యో..వానరమా
రామడుగు, ఆగస్టు 1: రామడుగు మండలంల గోపాల్‌రావుపేట కూరగాయల మార్కెట్ వద్ద గల చెట్టుకు ప్రమాదవశాతు ఉరిపడి ఒక వానరం మృతిచెందింది. ఎక్కడినుంచో వచ్చిన వానరం కూరగాయల మార్కెట్‌లో అటు ఇటు సందడి చేస్తూ తాడుకి చుట్టుకుంది. ఆ తాడుతో చెట్టుపై తిరుగుతుండగా ప్రమాదవశాతు మెడకు ఉరిపడి ఊపిరాడక మృత్యువాతపడింది. విషయాన్ని గమనించిన గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎంపీ టీసీ ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, నాయకులు మల్లేశం, కమలాకర్, పాపిరెడ్డి, మహేశ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.