పథకం ప్రకారమే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవదహనం..!

ABN , First Publish Date - 2020-11-25T17:46:14+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పవన్‌కుమార్‌ సజీవదహనం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, పవన్‌కుమార్‌ను భార్య కృష్ణవేణి ఆమె బంధువులు హత్య చేశారని మృతుని తండ్రి గంగాధర్‌, తల్లి భారతి, బంధు వులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు మండలంలోని బల్వంతా పూ ర్‌ గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగిన పవన్‌కుమార్‌ సజీవదహ నం

పథకం ప్రకారమే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవదహనం..!

 పవన్‌ కుటుంబసభ్యుల ఆరోపణ

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ 

ఏడుగురిపై కేసు నమోదు 


మల్యాల (కరీంనగర్): సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పవన్‌కుమార్‌ సజీవదహనం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, పవన్‌కుమార్‌ను భార్య కృష్ణవేణి ఆమె బంధువులు హత్య చేశారని మృతుని తండ్రి గంగాధర్‌, తల్లి భారతి, బంధు వులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు మండలంలోని బల్వంతా పూ ర్‌ గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగిన పవన్‌కుమార్‌ సజీవదహ నం సమాచారంతో హైదరాబాద్‌ నుంచి అతని బంధువులు తరలివచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం కృష్ణవేణికి సంబంధించిన ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వాటిని ఆమె సో దరుడు జగన్‌ తీసాడనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పవన్‌, జగన్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ నెల 12న జగన్‌ గుండెపోటుతో మృతి చెందాడు. పవన్‌ జగన్‌పై చేతబడి చేయించి అతడి మృతికి కారుకుడయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ వారం కొండగ ట్టుకు వచ్చిన జగన్‌ చిత్రపటం వద్ద పవన్‌ కుమార్‌ నివాళులు అర్పిస్తుండగా వెనక నుంచి వచ్చి గది తలుపులకు తాళం వేసి,  బకెట్లలో నిలువ ఉంచిన పెట్రోల్‌ను పోసి నిప్పంటించారని అతని కుటుంబ సభ్యులు అన్నారు.


ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ..

సోమవారం నిర్వహించే జగన్‌ పెద్దకర్మ కు పవన్‌ భార్య కృష్ణవే ణి హైదరా బాద్‌ నుంచి శనివారమే వచ్చింది. ప వన్‌ సోమవారం సా యంత్రం పరామర్శకు వచ్చాడు. పవన్‌ ప్రయాణంలో ఉన్నప్పుడు అతని భార్య కృష్ణవేణితో  బంధువులు పదే పదే ఫోన్‌ చేసి ఒక్కరే వస్తున్నారా లేక ఇంకా ఎవరైనా  కలిసి వస్తున్నారా అని ఆరా తీశారని, ఇది గమనిస్తే పథకం ప్రకారమే హత్య చేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. జగన్‌ భార్య సుమలతకు పవన్‌ భార్య క్రిష్ణవేణి, బంధువులు కూడా సహకరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


సంఘటన  స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

సంఘటన స్థలాన్ని ఎస్పీ సింధూశర్మ మంగళవారం పరిశీలించారు. పవన్‌ భార్య కృష్ణవేణి, బావమరిది విజయ్‌, అతడి భార్య భవాని, జగన్‌ భార్య సుమలత, అత్త ప్రమీళ, వదిన స్వరూపతో పాటు పెట్రోల్‌ తీసుకువచ్చి, బకెట్లలో నింపి వారికి సహకరించిన కొం డగట్టుకు చెందిన ఉప్పు నిరంజన్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ కిషోర్‌, ఎస్సై నాగరాజు తెలిపారు.

Read more