మహిళా సంఘాలకు ఆర్థిక స్థితి మెరుగుపర్చేలా సహజ బ్రాండ్స
ABN , First Publish Date - 2020-12-31T05:03:42+05:30 IST
మహిళలు అభివృద్ధి చెందడంతో పాటు, మహిళా సంఘాల ఆర్థిక స్థితిగతులు మార్చే లా సహజ బ్రాండ్ రూపకల్పన చేసినట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మహిళలు అభివృద్ధి చెందడంతో పాటు, మహిళా సంఘాల ఆర్థిక స్థితిగతులు మార్చే లా సహజ బ్రాండ్ రూపకల్పన చేసినట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పొన్నాల గార్డెన్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహజ బ్రాండ్స్ ద్వారా ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రారంభోత్స వంలో పాల్గొని మాట్లాడారు. వివిధ మహిళా సంఘాల ద్వారా తయారు చేసిన వివిధ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలనే సదుద్దేశ్యంతో గత ఆరునెలలుగా కృషి చేసి, సహజ బ్రాండ్స్‌ను ఫైలెట్ ప్రాజెక్ట్‌గా జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసుకున్నారన్నారు. జిల్లాలో మొత్తం లక్షా 60వేల మంది మహిళా సంఘాల సభ్యు లు ఉన్నారని వారు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించడానికే పరిమితం కాకుండా సంఘాలకు ఆర్థిక ప్రయోజ నం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సహజ బ్రాండ్స్‌కు శ్రీకారం చు ట్టామని తెలిపారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మ కా న్ని కలిగించి, జిల్లా, మండల, గ్రామ సమైక్యల సహకారంతో సం ఘాల సభ్యులు అమ్మకాలు జరపాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ వసంత మాట్లాడుతూ మహిళా సం ఘాల ఉత్పత్తులకు సహజ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ కల్పిం చడం సంతోషకరం అన్నారు. అనంతరం సహజ బ్రాండ్ ఉత్ప త్తులను మంత్రితో పాటు ఇతర అతిథుల చేతుల మీదుగా ఆవి ష్కరించి, మంత్రి స్వయంగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమం లో డీసీఎంఎస్ ఛైర్మెన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీ నారాయణ, జిల్లా సమైక్య సభ్యులు వనిత, మంజులతో పాటు జిల్లాలోని సమైక్య సంఘాల బాధ్యులు, అధికారులు పాల్గొన్నారు.
రైతు వేదికలు రైతులకు శిక్షణ కేంద్రాలు
మేడిపల్లి : రైతు అర్థిక అభివృద్ధి సాధించేందుకు లాభసాటి పంటలను సాగు చేసేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మేడిపల్లి మండలంలోని పోరుమల్ల గ్రామంలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రిని రైతు ఎడ్ల బండిపై రైతు వేదిక వర కు తీసుకెళ్లారు. రైతు వేదికను ప్రారంభించి అనంతరం వేదిక ప రిసరాల్లో మొక్కలను నాటారు. 15 మహిళా సంఘాలకు రూ 50 లక్షల 50 వేలు బ్యాంకు రుణం అందజేశారు. ఇద్దరికి రైతు బీ మా చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను లక్షధికారులను చేయాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణం చేపట్టారన్నారు. అనంతరం కల్వకోట గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం 15 ఇండ్లను మంత్రి ప్రరంభించి లబ్ధిదారులకు అంజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ వసంత, వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, కలెక్టర్ రవి, డిసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ ఉమాదేవి, సర్పంచులు పాల్గొన్నారు.