మార్చి 2న గౌడ జనజాతర రాష్ట్ర మహాసభలు

ABN , First Publish Date - 2020-02-12T12:08:13+05:30 IST

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మార్చి 2న మోకుదెబ్బ గౌడ జనజాతర పేరుతో రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహిస్తున్నట్టు గౌడ జనహక్కుల పోరాటసమితి రాష్ట్ర కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్‌ తెలిపారు.

మార్చి 2న గౌడ జనజాతర రాష్ట్ర మహాసభలు

గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాగౌడ్‌


లక్ష్మీనగర్‌, ఫిబ్రవరి 11: హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మార్చి 2న మోకుదెబ్బ గౌడ జనజాతర పేరుతో రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహిస్తున్నట్టు గౌడ జనహక్కుల పోరాటసమితి రాష్ట్ర కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్‌ తెలిపారు. గౌడ జన సమ స్యల పరిష్కారం, సంక్షేమం కోసం ఈ సభలను ని ర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ సభల ద్వారా గౌడ కులస్థులు, గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు.


ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ గీత కార్మికులను చట్ట ప్రకారం ఎస్‌టీలుగా గుర్తించి లైసెన్స్‌లు పునరుద్ధరించాలని, గీత కార్మికులకు సబ్సిడీపై దిచక్ర వాహనాలు పంపిణీ చేయాలని, నీరా ప్రాజెక్టును గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ప్రభుత్వమే మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. గీత వృత్తిని ఎక్సైజ్‌ నుంచి తొలగించి పరిశ్రమగా గుర్తించాలని, రూ.5వేల కోట్ల నిధులను కేటాయిం చి ఆధునీకరించాలని, గీత కార్మికులకు ప్రమాద బీమా రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచి ప్రమాదం జరిగిన నెల లోపు షరతులు లేకుండా బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 


జనగామ జిల్ల్లాకు సర్వాయిపాపన్న జిల్లాగా పేరు మార్చాలని, ట్యాంక్‌బండ్‌పై సర్వాయిపాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారంగా నిర్వహించాలని, గీత కార్మికులకు పెన్షన్‌ను రూ.5వేలకు పెంచాలని, బ్రాందీషాపులలో 50శాతం గౌడ కులస్థులకు కేటాయించాలని, జిల్లాకో గౌడ హాస్టల్‌ను, కమ్యూ నిటీహాల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ  మహాసభలకు విశిష్ఠ అతిథిగా మంత్రి కేటీ ఆర్‌, ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ హాజరుకానున్నట్టు ఆయన తెలిపా రు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలోని అన్ని పార్టీ ల గౌడ కులస్థులు అధిక సంఖ్యలో హాజరై ఈ సభలను విజయవంతం చేయాలని నర్సాగౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సంద్భంగా మహాసభల వాల్‌ పోస్టర్ల ను ఆవిష్కరించారు.


సమావేశంలో గౌడ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, ఉపాఽధ్యక్షుడు సిద్ధి రాములు, నాయకులు డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌రావు, మల్లాగౌడ్‌, సురేష్‌, రాజమౌళి, బాలసాని స్వామిగౌడ్‌, వంగ శ్రీనివాస్‌, సతీష్‌బాబు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-12T12:08:13+05:30 IST