నిరాడంబరంగా స్మార్త కృష్ణాష్టమి సంబరాలు

ABN , First Publish Date - 2020-08-12T10:21:45+05:30 IST

కొవిడ్‌ కారణంగా మంగళవారం ఆలయాల్లో స్మార్త కృష్ణాష్టమి పూజలు, అభిషేకాలు, అర్చనలు నిరాడంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా స్మార్త కృష్ణాష్టమి సంబరాలు

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 11: కొవిడ్‌ కారణంగా మంగళవారం ఆలయాల్లో స్మార్త కృష్ణాష్టమి పూజలు, అభిషేకాలు, అర్చనలు నిరాడంబరంగా నిర్వహించారు. ఉట్టి వేడుకలు కూడా జరుగలేదు. భక్తులు ఇళ్లలోనే శ్రీకృష్ణ నామస్మరణలు చేస్తూ ఉపవాసాలు పాటించి దానాలు, అర్ఘ్యాదులు పాటించి భక్తి ప్రపత్తులు చాటుకు న్నారు. పద్మనగర్‌లో ఒక ఇంటిలో చిన్నారులు గోపిక, కృష్ణుల వేషధారణలో సందడి చేశారు. కొవిడ్‌-19 దృష్ట్యా ఇంట్లోనే ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందించారు. 


భగత్‌నగర్‌: గోకులయాదవ సంక్షేమట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2020-08-12T10:21:45+05:30 IST