అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయం : ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

ABN , First Publish Date - 2020-09-14T10:40:58+05:30 IST

అభివృధ్ది, సంక్షేమమే ప్రధాన ద్వే యమని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు

అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయం : ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 13: అభివృధ్ది, సంక్షేమమే ప్రధాన ద్వే యమని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని 47 వార్డులో డీఎంఎఫ్‌టీ రూ. 13.30 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్‌ నిర్మాణ పనులకు ఆదివారం బల్దియా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ భూమి పూజ నిర్వంహించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్ర మంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు షేక్‌ చాంద్‌ పాష, బొడ్ల జగదీష్‌. కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌ పాల్గొన్నారు. అలాగే పట్టణం లోని 32 వార్డుకు చెందిన కొండ్రగాం గారాం కు మంజూరైన రూ.60 వేల విలువగల సీ ఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ గంగమల్లు, నాయకు లు శంకర్‌ పాల్గొన్నారు.


సెలవుల అనంతరం సోమవారం ప్రారం భం కానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆ దివారం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన వైద్యశా లలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఆర్‌టీపీసీ ఆర్‌తో పాటు ర్యాపిడ్‌ పరీక్షలకు హాజరయ్యా రు. ర్యాపిడ్‌లో నెగెటివ్‌ రిపోర్ట్‌ రాగా ఆర్‌టీపీ సీఆర్‌ రిజల్ట్‌ సోమవారం రానుంది.


ముఖ్యమంత్రి కృషి వల్లే చెరువుల పునార్నిర్మాణం

రాయికల్‌ :  రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ చెరువులపై ప్ర త్యేక దృష్టి సారించి చెరువుల పునార్నిర్మాణం చేపట్టారని ఎమ్మెల్యే డా క్టరు సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాయికల్‌ పెద్ద చెరు వు లో చేపపిల్లను వదిలారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, జడ్పీటీసీ అశ్విని జాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ వేణు, ఏనుగు మల్లా రెడ్డి, రాజేష్‌, అనిల్‌, సురేందర్‌, లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-14T10:40:58+05:30 IST