సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2020-11-13T10:16:35+05:30 IST
ఆశించిన మేరకు గ్రామాలాభివృద్ధి జరగాలంటే సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జీలకుంటలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ నూ తన భవనాన్ని
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
ఓదెల, నవంబరు 12: ఆశించిన మేరకు గ్రామాలాభివృద్ధి జరగాలంటే సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జీలకుంటలో రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ నూ తన భవనాన్ని గురువారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకవర్గం సమయస్ఫూర్తి తో ప్రత్యేక చొరవ చూపడం వల్ల గ్రామపంచాయతీ భవ నం నిర్మించుకున్నామని సర్పంచ్, వార్డు సభ్యులను, కార్యద ర్శిని అభినందించారు. గ్రామం అభివృద్ధి జరగాలంటే సంక ల్పం, తపన ఉండి సర్పంచ్ కీలకంగా ఐక్యతతో ఉంటేనే సా ధ్యపడుతుందన్నారు. ఇదే గ్రామంలో రూ.14లక్షల నిధుల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. అనంతరం మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్తి మాలతి సమ్మిరెడ్డి, ఎంపీపీ రేణుకాదేవి, సింగిల్‌విండో చైర్మ న్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ రాగి రవిందర్‌రెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, రైతు సమన్వ య సమితి కోఆర్డినేటర్ కావటి రాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, వైస్‌ఎంపీపీ పల్లె కుమార్, స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
పదేళ్లకు పనులు పూర్తి..
జీలకుంట గ్రామపంచాయతీ నూతన భవనం పనులు ఎట్టకేలకు 10ఏళ్ల తర్వాత పూర్తయ్యాయి. 2011లో గ్రామ పంచాయతీ భవనం మంజూరు కాగా, వివిధ కారణాలతో భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుత సర్పంచ్ పత్తి మాలతి సమ్మిరెడ్డి నేతృత్వంలో పాలక మండలి కృషి తో ఎట్టకేలకు పనులు పూర్తికావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.