మంత్రి ఈటల రాజేందర్‌ ఉదారత

ABN , First Publish Date - 2020-12-25T18:09:36+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు..

మంత్రి ఈటల రాజేందర్‌ ఉదారత

సొంత ఖర్చుతో పోలీస్‌ శిక్షణ అభ్యర్థులకు అల్పాహారం, స్టడీ మెటీరియల్‌ అందజేత


హుజూరాబాద్‌(కరీంనగర్): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయనున్నారు. ఈ పుస్తకాలను సోమవారం మంత్రి చేతుల మీదుగా విద్యార్థులు అందజేయనున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు పోలీస్‌ శిక్షణ కోసం హైస్కూల్‌ గ్రౌండ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విద్యార్థులు వివిధ గ్రామాల నుంచి ఉదయం ఐదు గంటలకే వస్తున్నారు. టిఫిన్‌ లేక విద్యార్థులు అలిసిపోతున్నారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రిన్సిపాల్‌ నిర్మల, లెక్చరర్‌ తులసీదాస్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారికి శిక్షణ పూర్తయ్యే వరకు టిఫిన్స్‌ అందజేస్తామని హామీ ఇచ్చారు. పరీక్షల్లో పోటీ తట్టుకునేందుకు స్టడీ మెటీరియల్స్‌ కావాలని కోరగా వాటిని తెప్పించారు.

Updated Date - 2020-12-25T18:09:36+05:30 IST