సంక్షేమ రంగంలో ఆదర్శం తెలంగాణ

ABN , First Publish Date - 2020-08-16T10:57:59+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ

సంక్షేమ రంగంలో ఆదర్శం తెలంగాణ

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌


జగిత్యాల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో 74వ, స్వాతంత్య్ర వేడుకలను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత దేఽశాన్ని కరోనా మహామ్మారి శాశిస్తున్న సమయంలో స్వాతంత్య్ర వేడుకలను నింబంధనల మధ్య జరుపుకోవాల్సి వచ్చిందన్నారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఆరు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చి, రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు.


కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. 100 పడకలతో జేఎన్‌టీయూలో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసి రోగులకు మందులు, ఇంజక్షన్లు అందిస్తూ వైద్యుల పర్యవేణలో సేవలు అందిస్తున్నామని వివరించారు. అంతేకాకుంగా ప్రమాదకరంగా ఉన్న రోగుల కోసం ఐసీయూ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, డీసీఎంస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, ఆర్డీవో మాధురి, జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-16T10:57:59+05:30 IST